ఆదమరిస్తే.. అంతే.

ఆదమరిస్తే.. అంతే.

ప్రమాదకరంగా నల్ల ఘాట్ రోడ్డు రహదారి ప్రయాణం

స్టూడియో 10 టీవీ న్యూస్, జనవరి 15, మహానంది:

నంద్యాల -గిద్దలూరు నల్లమల్ల ఘాట్ రోడ్డు లోని రహదారి ప్రయాణం ప్రమాదకరంగా మారిందని వాహనదారులు, ప్రజలు వాపోతున్నారు.ఘాట్ రోడ్డు లోని మలుపుల వద్ద డివైడర్ అంచు దిమ్మెలు రోడ్డు ప్రమాదాల్లో దెబ్బతిని పడిపోయాయి. వాటిని మరమ్మతులు చేయకుండా అలాగే ఉంచడం వలన రోడ్డు ప్రమాదాలు ఎక్కువ చోటుచేసుకునే అవకాశం ఉందని,ఈ రహదారి వెంబడి వాహనాల్లో ప్రయాణం ప్రమాదకరంగా మారటంతో వాహన దారులు, ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. వాహనదారులు రాత్రి వేళ్ళలో ఈ రహదారిపై ప్రయాణం నరక యాతనగా మారిందని ఆందోళన చెందుతు న్నారు. ఎవరైనా ప్రయాణికులు ఆదమరిస్తే ప్రమాదం జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని, కావున ఆర్ అండ్ బి అధికారులు స్పందించి డివైడర్ అంచు దిమ్మెలను పునర్నిర్మాణం చేపట్టాలని వాహన దారులు, ప్రజలు కోరుతున్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!