గాజులపల్లెలో ఘనంగా జల్సా కార్యక్రమం
స్టూడియో 10 టీవీ న్యూస్ జనవరి 15, మహానంది:
సమాజంలోని ప్రజలందరి మధ్య సోదరభావాన్ని పెంపొందించడంతోపాటు ప్రపంచ శాంతికి ఇస్లాం మత పవిత్ర గ్రంథం ఖురాన్ బోధనలు ఎంతగానో దోహదం చేస్తున్నాయని మదర్సా నిర్వాహకులు అబ్దుల్ మన్నన్ అన్నారు.మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని మదర్సా హయాతుల్ ఇస్లాం ఆవరణలో ఆదివారం ఘనంగా జల్సా కార్యక్రమం నిర్వహించారు. హయాతుల్ ఇస్లాం మదర్సాలో రెండు సంవత్సరాలు చదువుకొని ఆఫీజ్ పూర్తి చేసుకొన్న ముగ్గురు విద్యార్థులు పట్టాలు పొందినందుకు మదర్సా నిర్వాహకులు అయిన అబ్దుల్ మన్నన్ ను గ్రామ నాయకులు గజ్జ పెద్దపకీరయ్య పూలమాల వేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గజ్జ పెద్దపకీరయ్య ను శాలువాతో మదర్సా నిర్వాహకులు అబ్దుల్ మన్నన్ సత్కరించగా, అనంతరం ఆయన పట్టాలు పొందిన విద్యార్థులకు తన అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.