ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
స్టూడియో 10 టీవీ న్యూస్, జనవరి 03, మహానంది:
మహానంది మండలం గాజులపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఏపీ యుఎస్ మహానంది శాఖ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయురాలు రవణమ్మ అధ్యక్షతన సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.అనంతరం జడ్పీ హెచ్ఎస్ గోపవరం స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఉపాధ్యాయురాలు సుభాషిని మరియు గాజులపల్లె ప్రైమరీ మెయిన్ స్కూల్ హెచ్ఎం బాలనాగమణి లను పూలమాలలు, సాలువలతో సత్కరించి మోమొంటోలను అందజేశారు. ఈసందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు రవణమ్మ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే లాంటి మహిళా ఉపాధ్యా యులను స్మరించడం అత్యంత అవసరమని మహిళలు ఎన్నో ఇబ్బందులు పడే దశలో మహిళా విద్య కోసం ఆమె ఎంతో కృషి చేశారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఏపీ యూఎస్ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు వెంకట రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (APUS) ఉపాధ్యాయుల సంక్షేమం కోసం మరియు విద్యార్థుల లో దేశభక్తి భావములను, క్రమశిక్షణ పెంపొందించడం కోసం ఉపాధ్యాయులకు అవస రమైన శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తూ ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా కార్యాలయకార్యదర్శి మల్లికార్జున, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.