రైతులకు ఉద్యాన పంటలపై శిక్షణ కార్యక్రమం…… జిల్లా వనరుల కేంద్రం ఏ.డి.ఏ.భాస్కరయ్య
మామిడి పంట నష్టపోకుండా చర్యలు చేపట్టాలి……ఉద్యాన సహాయకులు గోపాలకృష్ణ
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం వల్లివేడు రైతు భరోసా కేంద్రంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు పై మామిడి పంట నష్టపోకుండా రైతులు చర్యలు చేపట్టే విధంగా జిల్లా వనరుల కేంద్రం ఏ.డి.ఏ భాస్కరయ్య రైతులకు అవగాహన శుక్రవారం ఎం.పీ.ఈ.ఓ గోపాలకృష్ణ సమక్షంలో కల్పించారు.ఈ సందర్భంగా జిల్లా వనరుల కేంద్రం ఏ.డి.ఏ.భాస్కరయ్య మాట్లాడుతూ వర్షాలు మామిడి పంటకు ఇబ్బంది కరంగా మారుతుందని,మామిడిలో ముందుగా వస్తున్న పూత,మచ్చ,తెగులు,బూడిద తెగులు ఆశించి మగ్గిపోతున్నదని తెలిపారు.ఈ సమస్యకు నివారణకు వర్షాలు ఆగిన తర్వాత మామిడి చెట్లకు హెక్సాకోనాజోల్ (లీటరు నీటికి 2మి.లీ) లేదా అమిస్టార్(లీటరు నీటికి1 మి.లీ)తో పాటు ఇమిడాక్లోప్రిడ్(లీటరు నీటికి0.5 మిలీ)పిచికారి చేయాలని కోరారు.పూతరాని చెట్లలో పూత రావడానికి వర్షాలు ఆగిన తర్వాత పొలాన్ని తేలికగా దున్ని భూమిలో తేమ ఆరేటట్లు చేయాలన్నారు.తర్వాత చెట్లకు పొటాషియం నైట్రేట్(మల్టీ-కె)లీటర్ నీటికి10 గ్రాములు,ఫార్ములా- 4 సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని పిచికారి చేస్తే పూత మంచిగా వస్తుందని వివరించారు.ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఏ.ఓ వేణుగోపాలరావు మాట్లాడుతూ రబి కాలంలో వరిలో చేపట్టవలసిన తీర్థ పద్ధతులను గురించి వివరించారు.వరిలో అవసరానికి మించి యురియ వాడకం వలన పైరులో చీడలు అధికమై పంట నష్టపోతుందన్నారు అని,వరిలో పొటాష్ వాడకం ద్వారా నాణ్యత పెరుగుతుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉద్యాన సహాయకులు గోపాలకృష్ణ,పకృతి వ్యవసాయ సిబ్బంది రాధాకృష్ణ,రంగనాయకులు,మహేంద్ర,విజయ కుమార్,బాలాజీ,రైతులు,తదితరులు పాల్గొన్నారు.