*మాస్టర్ ప్లాన్ రోడ్లపై పురోగతి వుండాలి – మేయర్ శిరీష, కమిషనర్ అనుపమ*
*టి.డి.ఆర్ బాండ్లు త్వరగా అందించండి – డిప్యూటీ మేయర్ భూమన అభినయ్*
*తిరుపతి*
*తిరుపతి నగరాభివృద్దికి చేపట్టిన మాస్టర్ ప్లాన్ రోడ్ల పనుల్లో పురోగతి వుండేలా అధికారులు కృషి చేయాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం ప్లానింగ్ అధికారులతో ప్రత్యేక సమావేశంలో మేయర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ ప్రత్యక్షంగా పాల్గొనగా, జూమ్ మీటింగ్ ద్వారా డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి పాల్గొని చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి మాట్లాడుతూ రహదారుల అభివృద్ధితోనే నగరం మరింత అభివృద్ధి సాదిస్తుందనే ప్రణాళికతో కౌన్సిల్ ఆమోదంతో చేపట్టిన మాస్టర్ ప్లాన్ రోడ్లను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రజలతో కలిసి అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ఇప్పటికే పూర్తి చేసిన వై.ఎస్.ఆర్ మార్గం, అన్నమయ్య మార్గం గురించి వారు వివరిస్తూ ప్రజలకి ఎంతో ఉపయోగకరంగ ఈ రోడ్లు అందుబాటులోకి రావడం జరిగిందని, అదేవిధంగా మిగిలిన మాస్టర్ ప్లాన్ రోడ్లను పూర్తి చేయడం వలన ప్రజలు ట్రాఫిక్ కష్టాల నుండి బయటపడటమే కాకుండా రోడ్ల విస్తరణతో నగరం శరవేగంగా అధివృద్ది సారిస్తుందన్నారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ ముందరన్న గాంధీ విగ్రహం ప్రక్క నుండి గంగమ్మగుడి వైపుగా వెలుతున్న రోడ్డును ఏరియా అభివృద్దిలో భాగంగా వెడల్పు చేసే ప్రక్రియను త్వరితంగా పూర్తి చేసేందుకు ప్లానింగ్ సిబ్బంది మార్కింగ్ పనులను పూర్తి చేయాలని మేయర్ శిరీష, కమిషనర్ అనుపమ సూచించారు. డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి సమావేశంలోని అధికారులతో మాట్లాడుతూ రోడ్ల వెడల్పుకు తమ స్థలాలను ఇస్తున్న యజమానులకు మునిసిపల్ కార్పొరేషన్ తరుపున టి.డి.ఆర్ బాండ్లను త్వరితగతిన అందించేలా చూడాలన్నారు. మాస్టర్ ప్లాన్ రోడ్ల ఆవశ్యకతను ప్రజలకి మరింతగా వివరించాలని డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ అభిప్రాయం వెలిబుచ్చారు. ఈ సమావేశంలో మునిసిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ సునీత, డిప్యూటీ సిటీ ప్లానింగ్ ఆఫిసర్ దేవి కుమారి, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు బాలసుబ్రమణ్యం, షణ్ముగం, మాస్టర్ ప్లాన్ రోడ్ల ప్లానింగ్ సెక్రటరీలు, కార్పొరేటర్లు అనీల్ కుమార్, ఆంజినేయులు, వైసిపి నాయకులు దొడ్డారెడ్డి మునిశేఖర్ రెడ్డి, వంశీ, చింతలచేను గోఫి తదితరులు పాల్గొన్నారు.*