*భారతంమిట్టలో ఎం.ఇబ్రహీం ఖాన్(32)అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య*
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం భారతంమిట్ట 8వ క్లాస్ లో ఎం.ఇబ్రహీం ఖాన్(32)అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది.ఈ సందర్భంగా పాకాల ఎస్.ఐ రామకృష్ణ మాట్లాడుతూ మృతి చెందిన వ్యక్తి చెన్నైకి చెందినవాడు,ఇతను ఫకీర్ పేటకు చెందిన నౌజీయాను వివాహం చేసుకొన్నాడు,గత రెండు నెలల కిందట పాకాల భారతంమిట్టలో ఓ అద్దె ఇంట్లో కాపురం ఉంటున్నారు.
భార్య ఫకీర్ పేటలోని అమ్మ గారి ఇంటికి పోయి,తిరిగి వచ్చి చూసేసరికి తలుపులు మూసి ఉండటం అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం తెలిపునారు.అనంతరం తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లి చూడగా వంటగదిలో ఉరివేసుకొని మృతి చెందినట్లు గుర్తించారు.మృతి చెందిన వ్యక్తి చెన్నైలో సోఫాలు వ్యాపారం చేస్తుండే వాడని వ్యాపారంలో నష్టం రావడం,అప్పులు బాధలు ఎక్కువగా ఉండటంతో పాకాలకు వచ్చి కాపురం పెట్టాడని చెప్పారు.వీరికి ముగ్గురు పిల్లలు ఒకరు ఒకటవ తరగతి,రెండోవాడు బాలబడిలో చదువుకుంటున్నారని,మూడో బేబీకి రెండు సంవత్సరాలు అని తెలిపారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అంబులెన్స్ లో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.మృతికి గల కారణాలు దర్యాప్తులో తెలియాల్సి ఉంది అని పాకాల ఎస్.ఐ రామకృష్ణ తెలిపారు.