ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు
స్టూడియో 10 టీవీ న్యూస్, డిసెంబర్ 06, మహానంది:
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 65 వ వర్ధంతి సందర్భంగా మహానంది మండలం గాజులపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీ నందు మంగళవారం ఎమ్మార్పీఎస్ నంద్యాల జిల్లా కార్యదర్శి నరసింహుడు మాదిగ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీడిత ప్రజల ఉద్దరణకు పాటుపడిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని,అంబేద్కర్ నిర్మించిన రాజ్యాంగ సౌదాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మన అందరిదన్నారు. దేశానికి దిశను నిర్దేశించి, ప్రజలకు స్వేచ్ఛా వాయువును, హక్కులను ప్రసాదించిన మహోన్నత వ్యక్తి అని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాస్టర్, హరికృష్ణ, చంద్రశేఖర్, విజయ్ శేఖర్, తదితరులు పాల్గొన్నారు.