– కొత్త ఆప్షన్‌ను తీసుకవస్తున్న సంస్థ
– మీ నెంబర్‌కు మీరే సందేశం పంపొచ్చు
ప్రపంచంలో అత్యధిక యూజర్లను కలిగిన వాట్సాప్ సామాజిక మాధ్యమం వినియోగదారులకు సౌకర్యవంతమైన సేవలను అందిస్తోంది. ఇప్పటికే ఎన్నో సేవలను అందుబాటులోకి తీసుకవచ్చిన సంస్థ తాజాగా సెల్ఫ్ మెసేజ్.. ఆప్షన్‌ను ప్రవేశ పెట్టింది. ఈ సౌకర్యం ద్వారా మీ వాట్సాప్ నుంచి మీ నంబర్‌కు మెసేజ్ పంపొచ్చు! ప్రస్తుతం వాట్సాప్ (WhatsApp) నుంచి స్నేహితులు, బంధువులు, సహోద్యోగులకు మెసేజ్‌లు పంపుతుంటాం. మీ వాట్సాప్ నుంచి మీకే.. సెల్ఫ్ మెసేజ్ చేసుకున్నా దాఖలాలే లేవు. దానిని ఇప్పుడు వాట్సాప్ సంస్థ సాధ్యం చేసింది. డమ్మీ గ్రూపు క్రియేట్ చేయడం, థర్డ్‌పార్టీ పద్ధతుల్లో కాదు. ఈ సౌకర్యం ఎలా పనిచేస్తుందంటే 1:1 పద్ధతిలో పనిచేస్తుందని వాట్సాప్ చెబుతోంది. దీంతో యూజర్లు నోట్స్ ప్రిపరేషన్, రిమైండర్స్ ప్లాన్ చేసుకోవడంతోపాటు షాపింగ్ లిస్ట్‌ను రాసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ కొద్దిమంది ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఈ వారంలో పూర్తిస్థాయి యూజర్లకు పరిచయం చేయనున్నట్లు వాట్సాప్ చెబుతోంది. వాట్సాప్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత చాట్ మెసేజ్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే కాంటాక్ట్ లిస్ట్ కనిపిస్తుంది. అందులో మొదట మీ పేరు ఫోన్ నంబర్‌తోపాటు బ్రాకెట్‌లో యూ (You) అని ఉంటుంది. దానిపై క్లిక్ చేసి సెల్ఫ్ మెసేజ్ చేసుకోవచ్చు.