ఈ రెండు సినిమాలకు కామన్ లింక్..

సినిమా ఇండస్ట్రీలో హీరో వెంకటేష్ అంటే తెలియని వారు ఉండరు.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే నైజం వెంకటేష్ సొంతం. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతాడు వెంకీ.. ఇప్పటికి ఒక కుర్ర హీరో లాగే అందరినీ అలరిస్తూ ఉంటాడు. ఆయన సినిమాలు ఏవైనా సరే పెద్దగా హంగు ఆర్భాటాలు లేకుండా చాలా ఈజీగా జనాలకి కనెక్ట్ అవుతాయి. ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎలాంటి వివాదాలు లేని హీరో ఎవరైనా ఉన్నారు అంటే ఆయన వెంకటేష్ మాత్రమే అని చెప్పవచ్చు. అలాంటి వెంకటేష్ ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో ఏళ్లు అవుతోంది.

ఇప్పుడు వెంకటేష్ నటించిన రెండు సినిమాల మధ్య ఆసక్తికరమైన పోలికలు కుదిరాయి. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే’ ఈ రెండు చిత్రాలు మంచి విజయం సాధించాయి. ముఖ్యంగా లవ్, ఫ్యామిలీ అండ్ ఎమోషన్స్ హైలెట్ గా తెరకెక్కడంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ‘నువ్వు నాకు నచ్చావ్’ కి స్టార్ రైటర్ త్రివిక్రమ్ కథ, మాటలు రాశారు. విజయ్ భాస్కర్ డైరెక్ట్ చేశారు. వెంకీని అతని తండ్రి ఏదైనా ఉద్యోగం చూసి పెట్టమని తన స్నేహితుడి దగ్గరకు పంపుతాడు. అప్పటికే ఫ్రెండ్ కూతురు నందుకి ఎంగేజ్మెంట్ అయిపోయి ఉంటుంది. వెంకీ, నందుల పరిచయం, అది కాస్త ప్రేమగా మారడం, చివరికి ఏమైందనేదే కథ అని అందరికీ తెలుసు.

ఇక ‘ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే’ విషయానికి వస్తే, గణేష్ (వెంకటేష్), వాసు (శ్రీరామ్) మంచి ఫ్రెండ్స్, తను పనిచేసే చోట కీర్తి (త్రిష) ని చూసి ప్రేమలో పడతాడు. అలా జీవితం సాఫీగా సాగిపోతుండగా, హఠాత్తుగా తండ్రి చనిపోవడంతో కొద్దిరోజులు వాసు వాళ్ళ ఊరికి తీసుకెళ్తాడు. అప్పటికే వాసు, కీర్తిలకు నిశ్చితార్థమైపోతుంది. అందుకే గణేష్ ని దూరం పెడుతుంటుంది. తర్వాత గణేష్ వాళ్ళ ఫ్యామిలీతో ఎలా కలిశాడు? వాళ్ల పెళ్లి ఎలా జరిగింది అనే కథ కమామీషు చూసాం. ‘నువ్వు నాకు నచ్చవు’, ‘ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే’, ఈ రెండు చిత్రాల్లోనూ హీరో కలవడానికి ముందే హీరోయిన్లకి వేరే వాళ్లతో పెళ్లి ఫిక్స్ అయిపోతుంది. ఇద్దరితోను ప్రేమలో పడతాడు. విభేదాలు వస్తాయి. చివరికి పెద్దలే వీళ్ళ ప్రేమను అంగీకరించి వివాహం జరిపిస్తారు. అది సంగతి, “సింగిల్ గా ఉన్న అమ్మాయిని ఎవడైనా లవ్ లో పడేస్తాడు, కానీ ఎంగేజ్మెంట్ అయినా అమ్మాయిని లవ్ లో పడేసే వాడికి ఒక రేంజ్ ఉంటుంది” అంటూ మీమ్స్ వైరల్ అవుతున్నాయి.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!