బీసీలను మభ్యపెడుతున్నారు 50% ఉన్న రిజర్వేషన్ సరియైన తీరులో ఇవ్వడం లేదు
— జనాభా ప్రకారం 50 శాతం కు పెంచాలి
బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలలో రిజర్వేషన్లు కల్పించాలని పార్లమెంటు వద్ద భారీ ప్రదర్శన.
సుప్రీంకోర్టు EWS రిజర్వేషన్లను సమర్ధిస్తూ తీర్పు చెప్పినందున 50 శాతం గరిష్ట పరిమితి తొలగించినందున జనాభా
ప్రకారం బీసీ రిజర్వేషన్లను విద్యా, ఉద్యోగ రంగాలలో, స్థానిక సంస్థల ఎన్నికలలో, కేంద్రంలో 27 శాతం నుంచి 50శాతం పెంచాలని,
చట్టసభలలో కూడా బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని అలాగే బీసీ ఉద్యోగులకు
ప్రమోషన్లలలో రిజర్వేషన్ కల్పించాలని రాజ్యసభ సభ్యులు – జాతీయ బి.సి. సంఘ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు.ఆదివారం వికారాబాద్ పట్టణంలో మీడియా సమావేశంలో
ఆర్. కృష్ణయ్య ప్రసంగిస్తూ రిజర్వేషన్లపై విధించిన గరిష్ట
పరిమితి 50 శాతంనూ సుప్రీం కోర్టు తొలగించినందున ఎలాంటి
న్యాయపరమైన, రాజ్యాంగపరమైన అవరోధాలు లేనందున బిసి/ ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లను జనాభా ప్రకారం పెంచాలని డిమాండ్
చేస్తున్నాం. ఇటీవల EWS రిజర్వేషన్లు చెల్లుతాయని, 50% గరిష్ట పరిమితి కూడా సరికాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అలాగే 103వ
రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంట్ 50 శాతం గరిష్ట పరిమితి తొలగించి EWS – లకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించారు. కేంద్ర
ప్రభుత్వం చట్టం చేసింది. దీనితో రిజర్వేషన్లపై ఉన్న గరిష్ట పరిమితి తొలగిపోయింది. రిజర్వేషన్లపై న్యాయపరంగా, చట్టపరంగా,
రాజ్యాంగపరంగా యున్న అవరోధాలు తొలగిపోయాయి. కావున వెంటనే బీసీ రిజర్వేషన్లను జనాభా ప్రకారం కేంద్రంలో 27 శాతం
నుంచి 50 శాతం పెంచాలని కోరారు.డి.ఎం.కి, అన్నా
పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి 50 శాతం రిజర్వేషన్లు పెట్టాలని కోరారు. గతంలో YSR కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల క్రితం
పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టారు బి.సి బిల్లు పెట్టడానికి మద్దతుగా 14 పార్టీలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. టి.ఆర్.ఎస్. టి.డి.పి.
డి.ఎం.డి. పి.ఎం.క, సమాజ్ వాది పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, BSP, జనతాదళ్ (యునెటైడ్), జనతా దళ్ (D), కాంగ్రెస్
పార్టీ, నేషన్ లిష్టు కాంగ్రెస్ పార్టీ, ఆప్నా దళ్, లోక్ దళ్ పార్టీలు బిల్లుకు మద్దతు ఇచ్చారు. బిజెపి పార్టీ మద్దతు ఇవ్వడం లేదు. బిజేపి
పార్టీ మద్దతు ఇస్తే బిల్లు ఒక్కరోజులోనే బిల్లు పాస్ అవుతుంది. అన్ని పార్టీలు కూడా “బీజేపీని ఒప్పించండి మేము మద్దతిస్తా”
మంటు ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. కానీ బిజెపి పార్టీ బీసీల పట్ల తమ విధాన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి
శ్రీ నరేంద్రమోడీ బీసీ వర్గానికి చెందినవారు. బీసీలంతా నరేంద్ర మోడీ పై ఆశలు పెట్టుకున్నారు. నరేంద్ర మోడీ హయాంలో బీసీ లో
బిల్లు పెట్టకపోతే చరిత్ర కమించదని హెచ్చరించారు. లోక్ సభలో 94 మంది బీసీ లోక్ సభ సభ్యులు ఉన్నారు. పార్టీలకతీతంగా వీరు
బీసీల బిల్లుకు మద్దతు ఇవ్వాలి. లేకపోతే బీసీ వర్గానికి చెందిన లోక్ సభ సభ్యుల కు ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారని
హెచ్చరించారు.
బీసీలకు ఇచే
66బీసీలకు ఇచ్చేది బిక్షం కాదు. ఇది రాజ్యాంగ బద్ధమైన ప్రజాస్వామ్య హక్కు స్వాతంత్రం వచ్చినప్పుడు బీసీలకు అసెంబ్లీ –
పార్లమ్మెటుల్లో రిజర్వేషన్లు పెట్టకుండా అన్యాయం చేశారు. ఉద్దేశపూర్వకంగా ఈ కులాలను అందిచేస్తున్నారని విమర్శించారు. 2021-
22 లో సేకరించి బోయే జనాభా గణనలో కులాల వారిగా బీసీ జనాభా గణన చేయాలని సమావేశం కోరింది. ఎస్సీ/ఎస్టీల జనాభా ను
కులాల వారిగా సేకరిస్తున్నారు. బీసీల జనాభా సేకరించడానికి అభ్యంతరాలు ఏమిటి? చట్టపరమైన, న్యాయపరమైన అవరోధాలు ఏమీ
లేవు. పులులు తదితర జంతువుల లెక్కలు ఉన్నాయి. కానీ బిసి జనాభా లెక్కలు చేయాలంటే అనేక అభ్యంతరాలు చెబుతున్నారు.
ఈ వైఖరి మార్చుకోకపోతే బీసీలు తిరగబడతారని హెచ్చరించారు. సుప్రీం కోడ్డు- హై కోర్టు బి.సి. జనాభా లెక్కలు సేకరించాలని 40
సం.రాలుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాయి. కానీ కేంద్ర పురుత్వం బి.సి జనాభా లెక్కలు తీయకుండా బికించి అన్యాయం
చేస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోవాలని హెచ్చరించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని కులాలకు, సామాజిక వర్గాలకు వారి వారి జనాభా ప్రకారం రాజకీయ రంగంలో ప్రాతినిధ్యం
కల్పించాలి. కానీ మనదేశంలో 56 శాతం జనాభా కలిగిన బీసీలకు ఇంతవరకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించకుండా ఈ కులాలను
అణచిపెట్టారు. ప్రపంచంలో అణచివేతకు వివక్షకు గురైన అన్ని వర్గాలకు, అన్ని రంగాలలో వాటా ఇచ్చి ఇతర అభివృద్ధి చెందినవర్గాలతో సమానంగా అభివృద్ధి చేశారు. కానీ మనదేశంలో పీడిత కులాలను ఇంకా అంది వేయడానికి చూస్తున్నారు తప్ప అభివృద్ధి
చేయడానికి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.
రాజ్యాధికారం ద్వారానే BC/SC/ST లు ధనవంతులవుతారు. కోటీశ్వరులవుతారు. ప్రతి ఒక్కరికి ఉచిత విద్యా లభిస్తుంది.
చదువుకున్న వారికి ఉద్యోగం లభిస్తుందన్నారు. భూములు లేని వారికి భూములు వస్తున్నాయి. గుడిసెలు యున్నవారి ఇల్లు
స్థానంలో బంగ్లాలు వస్తాయి. ఈ వర్గాలను సమాజంలో గౌరవం పెరుగుతుంది. లేకపోతే దోపిడి వర్గాల రాజ్యంలో బలహీన వర్గాలు ఎలా
అభివృద్ధి చెందుతారు. 75 సంవత్సరాల తర్వాత కూడా BC/SC/ST లు సబ్సిడీ బియ్యం కోసం పెన్షన్ల కోసం వేచి చూడవలసి వస్తుంది.
పేద కులాలకు రాజ్యాధికారం వచ్చిన రోజు ఈ కష్టాలు ఉండవన్నారు. ప్రపంచంలో ప్రజాస్వామ్యం వచ్చిన తరువాత అన్ని దేశాల
ప్రజలు అభివృద్ధి చెందుతున్నారు.
పార్లమెంటులో బి.సి. బిల్లు ప్రవేశపెట్టి, చట్ట సభల్లో బీసీ లకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని. బి.సి
ఉద్యోగులకు ప్రమోషన్లను రిజర్వేషన్లు కల్పించాలి. ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని, కేంద్ర విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు బి.సి.ల
జనాభా ప్రసాదం 27శాతం నుండి 56 శాతంకు పెంచాలని కోరారు. రాజ్యాంగాన్ని సవరించి చట్ట సభలలో 50 శాతం సీట్లు అదనంగా
పెంచి అత్యంత వెనుకబడిన కులాలకు నామినేటెడ్ పద్ధతిలో ఈ సీట్లు ఇవ్వాలి. విదేశీయులైన ఆంగ్లో-ఇండియన్లుకు నామినేటెడ్
యం.యల్.ఏ లూగా, యం.పి.లుగా ఇస్తున్నారు. కాని ఈ దేశంలో పుట్టిన అత్యంత వెనుకబడిన కులాలకు ఇవ్వడం లేదు. అందుకే
అత్యంత వెనుకబడిన కులాలకు ఇంతవరకు అసెంబ్లీకి పార్లమెంటు కడప తొక్కని కులాలకు ఆంగ్లో-ఇండియన్ల మాదిరిగా
నామినేటెడ్ యం.యల్.ఏ / యం.పి లు ఇవ్వాలని కోరారు. పంచాయతీరాజ్ సంస్థలో బి.సి. రిజర్వేషన్లను 22 శాతం నుంచి 50
శాతంకు పెంచాలి. ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలని కోరారు.బి.సి.ల విద్యా, ఉద్యోగ, రిజర్వేషన్ల పై ఉన్న క్రిమి లేయర్ను తొలగించాలని, బి.సి.లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు
చేయాలి. బీసీల అభివృద్ధికి ప్రత్యేక స్కీములను రూపొందించాలని, ఎస్సీ / ఎస్టీ అట్రా సిటీ యాక్ట్ మాదిరిగా బి.సి.లకు సామాజిక రక్షణ,
భద్రత కల్పించడానికి బి.సి. యాక్ట్ను తీసుకురావాలని, ప్రపంచీకరణ సరళీకృత, ఆర్థిక విధానాలు రావడం పారిశ్రామికీకరణ
వేగవంతంగా జరగడం ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చాయి. అందుకే ఎస్సీ/ఎస్టీ / బి.సి.లకు ప్రైవేటు రంగంలో
రిజర్వేషన్లు పెట్టాలని కోరారు. సుప్రీం కోర్టు- హై కోర్టు జడ్జీల నియామకాలలో ఎస్సీ/ ఎస్టీ బి.సి.లకు రిజర్వేషన్లు పెట్టాలని, కేంద్రంలో
బి.సి.లకు పోస్ట్ మెట్రిక్స్ స్కాలర్ షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ స్కీము విధానం సాచురేషన్ పద్ధతిలో ప్రవేశపెట్టాలి. రాష్ట్రాలకు
80 మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వ శాఖలలో, ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ
చేయాలని కోరారు.కేంద్ర స్థాయిలో 2 లక్షల కోట్ల బడ్జెట్ బి.సి సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని, జనాభా లెక్కల లో బి.సి. కులాల వాది
లెక్కలు సేకరించాలని కోరారు.