సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్, యూనియన్, సిఐటియు, అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలం, ఎంఈఓ ఆఫీస్ ఆవరణలో, ఆదివారం ఉదయం, వై సుజాత అధ్యక్షతన, మండల సమన్వయ కమిటీల సమావేశం జరిగినది. ఈ సమావేశానికి సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ చంద్రశేఖర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, సిఐటియు 1970లో ఐక్యత పోరాటం, నినాదంతో ఏర్పడిందన్నారు. కార్మికులు కష్టజీవులు ఐక్యపరిచి, దోపిడీ లేని సమాజం కోసం పోరాడుతుంది అని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నారని, వాటికి వ్యతిరేకంగా, కార్మికుల హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. సిఐటియు నూతన మండల కమిటీనీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. అధ్యక్షులుగా, కే. నాని, ప్రధాన కార్యదర్శిగా, ఎదురూరి, సుజాత, కోశాధికారిగా, కొరముట్ల. సుధాకర్, ఉపాధ్యక్షులుగా డి.నాగరత్న, సి నాగిరెడ్డి, బొమ్మి సుబ్బరాయుడు, నాగేశ్వరరావు, పి. శివకుమారి, ఎం సుబ్రహ్మణ్యం, సహాయ కార్యదర్శులుగా, చక్రపాణి, వెంకటేశ్వర్లు, కోలారమణ, శంకర్ రెడ్డి, డి.దేవి, ఎం.చిన్న. కమిటీ సభ్యులుగా మరో 11 మందిని ఎన్నుకున్నారు. కమిటీ సభ్యులు, ఏ చంద్ర, జె రమణ, ఎస్ రామకృష్ణయ్య ఎస్ షేక్ బాషా, టి వెంకటరమణ వై సురేష్, టి నర్సింలు, ఎం రమేష్, వై.నరసింహులు, ఏ పెంచలయ్య, తదితరులు ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి, పంది కాళ్ళ, మణి, మాట్లాడుతూ ఉద్యోగులు కార్మికుల చేసే పోరాటానికి, వ్యవసాయ కార్మిక సంఘం అండగా నిలబడుతుందని తెలిపారు. కెవిపిఎస్ జిల్లా కన్వీనర్ ఓబిలి పెంచలయ్య పాల్గొన్నారు. మండల సమన్వయ కమిటీసమావేశానికి, అంగనవాడి, ఆటో,ఆశ, గ్రామ సేవకులు, పంచాయతీ వర్కర్స్, ఫీల్డ్ అసిస్టెంట్లు, విద్యుత్తు సంఘాల నుంచి హాజరయ్యారు.