సిద్ధాంతం ఆధారంగానే బిజెపి ఎదుగుదల

సిద్ధాంతం ఆధారంగానే బిజెపి ఎదుగుదల

ప్రపంచములోనే అతి పెద్ద పార్టీ బిజెపి

బిజెపి రాష్ట్ర నాయకులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి

సిద్ధాంతాలతోనే బిజెపి ఎదిగిందని, ప్రపంచంలో 13 కోట్ల పార్టీ సభ్యత్వం గల ఏకైక పార్టీ బిజెపి అని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో కిసాన్ మోర్చా ప్రశిక్షణ శిబిరంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నెల్లిశ్రీ వర్ధన్ రెడ్డి. బిజెపి చరిత్ర వికాసం అంశం పైన మాట్లాడడం జరిగింది. బిజెపికి పూర్వం జన సంఘ్ ని 1951 అక్టోబర్ 21న డాక్టర్ శ్యామప్రకాష్ ముఖర్జీ స్థాపించారని, జనసంఘ్ స్థాపన దేశ రాజకీయాల్లో ఒక కీలక మలుపు. జనసంఘ్ నుంచి ఈరోజు వరకు కూడా నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ వ్యక్తి లాస్ట్ అనే సిద్ధాంతం ఆధారంగా పార్టీ నిర్మాణం ప్రారంభమైందని జనసంఘ్ నుండి నేటివరకు కూడా దేశానికి సంబందించిన మౌలిక అంశాల ఆధారంగా పనిచేస్తుంది అని అన్నారు .జనసంఘ్ సిద్ధాంతకర్త దిన్ దయాల్ ఉపాధ్యా ప్రవచించిన ఏకాత్మత మానవతా వాదం ఆధారంగా ఆ నాటి నుండి ఈ నాటి వరకు పనిచేస్తుందని అన్నారు . ఇందిరాగాంధీ దేశములో 1975 జులై 26 న విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకముగా క్రియాశీలక పాత్ర పోషించి అనేక మంది నాయకులు జైలు జీవితాలు అనుభవిస్తూ ప్రజాస్వామ్యం పునరుద్ధణ కోసం ఎన్నో పోరాటాలు చేసిందని ,దేశం కోసం జనసంఘ్ ను జనతా పార్టీలో విలీనం చేశారు. కొంతమంది జనతాపార్టీ నాయకుల స్వార్థ రాజకీయాల కారణంగా జనతా ప్రయోగం విఫలమైన తరువాత 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజపేయ్, అద్వానీ నేతృత్వంలో ప్రారంభమై 1984 లో కేవలం రెండు సీట్ల నుంచి ప్రారంభమైన పార్టీ ఈరోజు 303 సీట్లుగా ఎదిగి 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటూ అనేక రాష్టాలలో నిర్మాణాత్మక ప్రతి పక్షంగా ఉంటు సురక్షితమైన సుశిక్షమైన భారతదేశంగా ఎదగగాలని సుపరిపాలన అందింస్తు శ్రీ నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి నాయకత్వములో ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యంతో పనిచేస్తుందని, సభుకా సాతు సభుకా విశ్వస విధానంతో బిజెపి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి అన్నారు . బిజెపి ఈ రోజు ప్రపంచములో అతి పెద్ద సభ్యత్వం 13కోట్ల పైన కల్గిన పార్టీ గా కోట్లాదిమంది కార్యకర్తలు వారి త్యాగాలు,వారి ఆలోచనలే బిజెపి ఎదుగుదలకి కారణం. ఈ పార్టీ నాయకులను తయారుచేస్తుంది కాని ఫాలోవర్స్ ను కాదు . ఈ పార్టీ ఎదుగుదల సిద్ధాంతం ఆధారంగానే ఉంటుందని భవిష్యత్తులో కూడా తెలంగాణ లో కూడా సిద్ధాంతం ఆధారంగానే అధికారంలోకి వస్తుందని ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సిద్ధాంతం ఆధారంగానే వస్తుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో భద్రాద్రి జిల్లాకు సంబంధించిన కిసాన్ మోర్చా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!