కష్టపడ్డ కార్యకర్తలకు గుర్తింపు
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వీర్లపల్లి శంకర్
కాంగ్రెస్ పార్టీ ఓబిసి సెల్ నియోజకవర్గం చైర్మన్ గా చంద్రశేఖర్
కాంగ్రెస్ పార్టీలో నిబద్ధతగా నిత్యం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ఎల్లప్పుడూ ప్రత్యేక గుర్తింపు ఉంటుందని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వీర్లపల్లి శంకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయనోనిపల్లి చంద్రశేఖర్ (జాకారం)ను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఓబీసీ సెల్ చైర్మన్ గా నియమించినందుకు ఆయనను ఆదివారం శాలువా పూలమాలతో వీర్లపల్లి శంకర్ తదితరులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నియామక పత్రాన్ని శంకర్ చేతులమీదుగా చంద్రశేఖర్ కు అందజేశారు. అనంతరం శంకర్ మాట్లాడుతూ.. చంద్రశేఖర్ ఓబీసీ సెల్ చైర్మన్ గా రెండోసారి ఎంపిక కావడం సంతోషంగా ఉందని అన్నారు. కష్టపడి నిజాయితీగా నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ కడుపులో పెట్టుకొని చూసుకుంటుందని శంకర్ అన్నారు. చైర్మన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ తనపై ఎంతో విశ్వాసంతో చైర్మన్ పదవిని రెండోసారి కూడా తనకే అప్పగించినందుకు ఓబీసీ సెల్ రాష్ట్ర చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ కు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా తన రాజకీయ అభివృద్ధికి సహకరిస్తున్న వీర్లపల్లి శంకర్ తదితరులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. తనపై పెట్టిన గురుతరమైన బాధ్యతలను నిబద్దతగా వ్యవహరిస్తానని పార్టీకి మంచి పేరు తీసుకువస్తానని చంద్రశేఖర్ మీడియాకు తెలిపారు. చంద్రశేఖర్ ను సన్మానించిన వారిలో కాంగ్రెస్ నాయకులు టిపిసిసి సభ్యులు మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, కొందుర్గు మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, చౌదరిగుడా మండల పార్టీ అధ్యక్షుడు రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్, మొగులయ్య,సత్యంరెడ్డి, అశోక్, పద్మాల వెంకటేష్, మోహన్, నవీన్, గంగమోని సత్తయ్య, చిలకమర్రి నర్సింహులు, వెంకట నర్సింహారెడ్డి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.