ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను తనిఖీ చేసిన వైద్య అధికారులు
స్టూడియో 10 టీవీ న్యూస్, నవంబర్ 26, మహానంది:
మహానంది మండలం గాజులపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను శనివారం డిప్యూటీ డైరెక్టర్ ఏటి రామనాథ రావు,డిఎంఓ కామేశ్వరరావు,డాక్టర్ జగదీష్ చంద్ర రెడ్డి, తనిఖీ చేశారు.అనంతరం వైద్యాధికారి డాక్టర్ వెంకట్ రెడ్డితో కలిసి ఆసుపత్రిలోని స్థితిగతులు,రిపోర్టులు, మరియు పలు రికార్డులను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఏఎన్ఓ. వరప్రసాద్ రెడ్డి, సిహెచ్ఓ పి. పెంచలమ్మ, ఎంపీహెచ్ఈఓ.హుస్సేన్ రెడ్డి ,పిహెచ్ఎన్ కే. విజయలక్ష్మి, ఏఎన్ఎంలు మరియు పిహెచ్సి యొక్క వైద్య సిబ్బంది పాల్గొన్నారు.