వికారాబాద్ జిల్లాn: జిల్లాలో రోడ్లు బాగలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అవసరమైన చోట స్పీడ్ బ్రేక్ లు వేయాలని, దానితో పాటుగా మలుపుల వద్ద సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని రోడ్లు భవనాల జిల్లా కార్యనిర్వహన ఇంజినీర్అధికారి లాల్ సింగ్ ను నాయకులు ఆవుటి రాజశేఖర్, టైగర్ కృష్ణ, పెండ్యాల ఆనంతయ్య, తదితరులు కోరారు. జిల్లాలో పూర్తిగా రోడ్లు పాడయ్యాయని, గతుకుల, గుంతల రోడ్లతో జనం అవస్థలు పడుతున్నారని రోడ్లను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని తెలియపరచారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు.