భక్తులతో కళకళలాడిన మహానంది పుణ్యక్షేత్రం
స్టూడియో 10 టీవీ న్యూస్, నవంబర్ 21, మహానంది:
మహానంది పుణ్యక్షేత్రంలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా భక్తజనంతో కిటకిట లాడుతుంది. ఆయా ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తెల్లవారుజామునే కోనేరులోపుణ్యస్నానాలు ఆచరించి శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందిశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం స్వామి వారి రుద్రాభి షేక ములను ,కేదారేశ్వర స్వామి నోములను నిర్వహించుకున్నారు. ఆలయ ప్రాంగణం లోని నాగుల కట్ట, ధ్వజస్తంభం, నంది స్తూపం వద్ద కార్తీక దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పర్యవేక్షిస్తున్నారు.అనంతరం తిమ్మాపురం వైసిపి యువ నాయకులు ఒంటెద్దు వీరారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐ నాగార్జున రెడ్డి, గాజులపల్లి వైసిపి నాయకుడు కొండా మధుసూదన్ రెడ్డి, భక్తులకు అన్నదానం నిర్వహించారు.