గ్రామాల అభివృద్ధికి అధికారులు చిత్త శుద్ధితో పనిచేయాలి…
ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులకు అందే విధంగా అధికారులు చొరవ చూపాలి..
కోరుకొండ మండలం సర్వసభ్య సమావేశంలో వివిధ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా..
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో పని చేయాలని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు రాజానగరం శాసన సభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు..
శనివారం నాడు కోరుకొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎం.పీ.పీ ఉల్లి వీర వెంకట సూర్య కుమారి అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా విద్యుత్,విద్య,వైద్యం,శిశు సంక్షేమం, ఇరిగేషన్,తాగు,సాగు నీరు,జాతీయ ఉపాధి హామీ పథకం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ కోరుకొండ మండలంలో సాంక్షన్ అయిన అభివృద్ధి పనులను త్వరగతిన పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.
మండలంలోని అధికారులు గ్రామంలోని అధికారులు చిత్తశుద్ధితో పనిచేసే మండల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలన్నారు..
ముస్లిం సోదరుల బరియల్ గ్రౌండ్ నిర్మాణానికి మరియు మసీదుల నిర్మాణానికి అన్ని చర్యలు చేపడుతున్నామని లాలాచెరువు, దివాన్ చెరువు,కోరుకొండ ఇన్నగంటివారి పేట తదితర ప్రాంతాలలో బరియల్ గ్రౌండ్స్ నిర్మాణం కోసం మరియు అభివృద్ధి పనుల కోసం కోటి రూపాయలు వ్యయంతో ప్రతిపాదనలను సిద్ధం చేశామన్నారు.
రాజానగరం నియోజకవర్గంలో ఒక్కొక్క ఆలయ నిర్మాణానికి పది లక్షల రూపాయలు చొప్పున 117 ఆలయాల నిర్మాణానికి చర్యలు,కోరుకొండ ఆలయ అభివృద్ధిల్లో భాగంగా వివిధ పనుల నిమిత్తం రూ.9.68 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలన్నిటిని సిద్ధం చేసి టీటీడీ చీఫ్ ఇంజనీర్ ఆఫీసర్ డి.నాగేశ్వరావు గారికి అందజేయడం జరిగిందన్నారు.
కోరుకొండ మండలం గ్రామాల వారిగా జరిగిన జలజీవన్ మిషన్ పైప్ లైన్ నిర్మాణ పనులను,సీసీ రోడ్ల నిర్మాణ పనులను గూర్చి సంబంధిత అధికారులు ఆరా తీశారు.
కోరుకొండ మండలం మునగాల గ్రామం నందు పైపులైను మరమ్మత్తుల పనులను సత్వరమే పూర్తిచేసే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలన్నారు..
నియోజకవర్గంలో క్రిస్టియన్ సోదరుల చర్చిల ఆధునీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి కోటి రూపాయల నిధులు కేటాయించడం జరిగిందని మండలంలో చర్చిల ఆధునికరణకు ప్రాధాన్యత ఇస్తున్నమన్నారు..
ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఉన్న అపోహలను సంబంధిత అధికారులు తొలగించాలని, ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో చూపెడుతున్న శ్రద్ధ రైతులకు సంబంధిత అధికారులు వివరించాలన్నారు
కోరుకొండ మండల 2022-2023 సవరణ బడ్జెట్ లో భాగంగా ఆదాయం 21,19,52,645 రూపాయలు వ్యయం 21,19,22,765 రూపాయలు, మిగులు బడ్జెట్ 29,250 రూపాయలను సభ ఆమోదించబడిది.
2023-24 సంవత్సరానికి గాను అంచనా బడ్జెట్ను ఆమోదించబడినది
అనంతరం కోరుకొండ కాపవరం గ్రామం నందు 18 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సగర కులస్తుల కమ్యూనిటీ హాలును ఎంఎల్ఏ జక్కంపూడి రాజా చేతుల మీదగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కరీనాగేశ్వరావు ఎంపీపీ ఉల్లి వీర వెంకట సత్య సూర్య కుమారి, ఏం.ఎం.సి చైర్మన్ నక్క రాంబాబు, మండల కన్వీనర్ ఆడప కనకరాజు, మాజీ మండల కన్వీనర్ ఉల్లి బుజ్జి బాబు,సర్రాజ్జు, ఎండిఓ పిఎస్ నరేష్ కుమార్ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు