మహానంది క్షేత్రంలో ప్రాణ ప్రతిష్టకు నోచుకోని నంది విగ్రహం
స్టూడియో 10 టీవీ న్యూస్, నవంబర్ 19, మహానంది:
మహానంది క్షేత్రంలోసర్కిల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన నంది విగ్రహం నేటికీ కూడా ప్రాణ ప్రతిష్టకు నోచుకోలేదని పలువురు భక్తులు విమర్శిస్తున్నారు. దాదాపు 5 సంవత్సరాల క్రితం మహానంది క్షేత్రం ప్రధాన ఆలయం ముందు బాగాన తేరు రథం సమీపంలో ఏర్పాటు చేయడం జరిగింది పాలకులు పార్టీలు మారుతూ ఉండడంతో గతంలో నంది విగ్రహం చుట్టూ రాజకీయ ప్రకంపనలు ఏర్పడ్డాయని పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు .ఏర్పాటు చేసింది ఎవరైనా అభివృద్ధి పేరిట మార్పులు చేర్పులు చేసి భక్తులను ఆహ్లాద పరిచేందుకు ప్రణాళిక చేపట్టారు.కానీ అది కార్యరూపం దాల్చిన నంది విగ్రహం ప్రాణ ప్రతిష్టకు నోచుక పోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కనీసం నంది విగ్రహానికి ప్రదోషకాల సమయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉన్న అవి ఏమి నేటికీ చేపట్టకపోవడం విడ్డూరమని పలువురు భక్తులు భావిస్తున్నారు.ఆలయ ప్రధాన గోపురాలపై ఉన్న కలశాలు కూడా ఒకవైపు వాలి ఉండడంతో వాటిని తీగలతో క్రింద పడిపోకుండా కట్టి ఉంచడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.పీఠాధిపతుల చేత కలశ స్థాపన చేయించాల్సి ఉందని ఆలయ వర్గాలు పేర్కొంటున్నాయి.కోవిడ్ కంటే ముందు ప్రయత్నాలు చేసినా కోవిడ్ కారణంగా వాయిదా పడినట్లు సమాచారం.అధికారులు మారుతున్న ప్రజా ప్రతినిధులు మారిన కలశ స్థాపన ఎప్పుడు జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం.ఆలయ ప్రధాన మూల విరాట్ కు పూజలు నిర్వహించడంతో పాటు ఆలయం చుట్టూ ఉన్న పరివార దేవతామూర్తులకు కూడా ప్రత్యేక అలంకరణ చేయడం శాస్త్ర ధర్మం గా భావిస్తున్నారు. కానీ క్షేత్రంలో ఒక నంది విగ్రహాన్ని ఏర్పాటు చేసి దానికి ఎలాంటి ప్రాణ ప్రతిష్ట మరియు ఇతర కార్యక్రమాలు నిర్వహించకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.