KLM GOLD కంపెనీ ని నమ్మించి, నమ్మక ద్రోహం, చేసిన ముద్దాయి అరెస్టు

తిరుపతి జిల్లా:

KLM GOLD కంపెనీ ని నమ్మించి, నమ్మక ద్రోహం, చేసిన ముద్దాయి అరెస్టు

1,013.08 గ్రాములు బంగారు,100,000/- నగదు స్వాదీనం

ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిదిలోని KLM గోల్డ్ కంపనీ నందు అదే సంస్థలో మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న అతను కంపెనీని మోసం చేసి 30.10.2022 వ తేది నాడు బంగారు నగలతో పాటు కొంత నగదును కూడా దోచుకొని వెళ్ళిన కేసుకు సంబందించి శనివారం జిల్లా పోలీస్ కార్యాలయం నందు జిల్లా యస్.పి శ్రీ పి.పరమేశ్వర రెడ్డి, ఐ.పి.యస్ గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా యస్.పి గారు మాట్లాడుతూ తిరుపతి పట్టణం కొర్లగుంట ప్రాంతంలో కె.ఎల్.ఎమ్ గోల్డ్ లోన్ ఫైనాన్స్ సంస్థను కొత్తగా ఏర్పాటు చేశారు. ఇంతకుముందు శ్రీకాళహస్తిలో జరిగినటువంటి పింక్ కేర్ బ్యాంక్ నేరం నకు సంబంధించి అదే తరహాలో ఇక్కడ కూడా జరిగింది. ఇదే సంస్థలో పని చేసే అసిస్టెంట్ మేనేజర్ శాంత కుమార్ ప్రజల దగ్గర నుంచి బంగారం కుదవ పెట్టుకొని వారికి డబ్బులు ఇచ్చే వ్యాపారం కంపనీ తరపున చేస్తున్నాడు. ఇదే క్రమంలో దురాశ బుద్దితో ప్రజలు డిపాజిట్ చేసిన బంగారాన్ని శాంత కుమార్ తన సొంత ప్రయోజనాలకు వాడుకునేవారు. అలాగే తన యొక్క భార్య, స్నేహితుల పేరు పైన బంగారు నగలు కుదవ పెట్టి ఇతరుల యొక్క బంగారాన్ని కూడా ఇతను తీసుకొని ఇతర ఫైనాన్స్ సంస్థలలో పెట్టి లోను డబ్బులు తీసుకొని అవకతవకలకు పాల్పడేవాడు.

ఈ విషయాన్ని కంపెనీ పై అధికారులు గమనించి కంపెనీ లెక్కల కొరకు అధికారులు ఆడిట్ చేయడానికి వస్తారు అన్న సమాచారాన్ని కంపనీవారు తెలపగా ఆడిట్ జరిగితే తన యొక్క అవకతవకలు బయటపడతాయని గ్రహించి ఫైనాన్స్ సంస్థలో పెట్టినటువంటి ప్రజల యొక్క బంగారాన్ని మరియు అతను భార్య యొక్క బంగారాన్ని ఇదివరికే తన వద్ద ఉన్న లాకర్ కీ సహాయంతో తీసుకొని పారిపోవడం జరిగింది.

ఈ సంస్థ యొక్క లాకర్ కీసు రెండు ఉంటాయి ఒకటి ఇతని దగ్గర ఉంటుంది మరియొక లాకర్ కీ వాళ్ళ యొక్క హెడ్ ఆఫీస్ కు పంపవలసి ఉంటుంది. కానీ ఇతను సంస్థను మోసం చేయాలి నగదు దొంగలించాలనే ఉద్దేశంతో రెండవ లాకర్ కీ ని పై అధికారులకు ఇవ్వకుండా ఇతర దగ్గరే ఉంచుకున్నాడు. ఆ యొక్క రెండు లాకర్ కీ లను ఉపయోగించి ఆ లాక్కర్లో ఉన్నటువంటి బంగారాన్ని తీసుకొని బెంగళూరు మరియు చెన్నై నగరాలకు పారిపోవడం జరిగింది.

ఇతను తన యొక్క కుటుంబ సభ్యులను తీసుకొని పారిపోవడానికి తిరుపతికి వచ్చినాడు అప్పుడు మా యొక్క సిబ్బంది అతన్ని పట్టుకుని ఇతని వద్ద నుండి సుమారు 1013.08 గ్రాముల బంగారాన్ని మరియు లక్ష రూపాయలు నగదును స్వాధీనపరుచుకున్నారు. ఈ యొక్క సొత్తు విలువ 34,58,998 రూపాయలు. అతని కంపెనీలో నగదు రూపంలో కూడా కొంత మొత్తం తీసుకున్నాడు అతని పోలీస్ కస్టడీకి తీసుకొని తర్వాత అది కూడా రికవరీ చేయాల్సి ఉంటుంది.

ఈ యొక్క కంపెనీ చిన్నది కనుక ఈ కంపెనీలో ఇతను గోల్డ్ అప్రైజరు కనుక ఇతని స్నేహితుడి ద్వారా కొద్దిగా నకిలీ బంగారాన్ని కూడా పెట్టి కొంత నగదు తీసుకున్నాడు. ఈ విధంగా తన యొక్క భార్య బంధువుల పైన గోల్డ్ లోను పెట్టేవాడు. ఆ బంగారం అంతా ఇతని ఆధీనంలోనే ఉంటుంది కనుక వాటిని మళ్లీ తీసుకొని బయట బ్యాంకులలో పెట్టేవాడు. ఆడిట్ వల్ల అతని యొక్క అవకతవకలు బయటపడతాయని లోన్లు ఉన్నాయి కానీ బంగారం లేదు కనుక పై అధికారులు తనిఖీ చేయగా దొరికిపోతామని ఉద్దేశంతో లాకర్ లో ఉన్నటువంటి మొత్తం బంగారం ను సుమారు 36 అకౌంట్లకు సంబంధించిన బంగారాన్ని తీసుకొని పారిపోవడం జరిగింది.

ఇతను ఈ కంపెనీలో దొంగతనం చేసి ఇతర నగరాలలో స్థిరపడాలని ఉద్దేశంతో చెన్నై మరియు బెంగుళూరు నగరాలలో తిరిగి తమిళనాడులోని ఒక ప్రాంతంలో స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు. అతని యొక్క కుటుంబ సభ్యులను తీసుకొని రావడం అతన్ని పట్టుకోవడం రికవరీ చేయడం జరిగింది.

ముఖ్యంగా నగరంలో ఫైనాన్స్ సంస్థలు బ్రాంచ్ లు మాత్రమే ఇక్కడ ఓపెన్ చేస్తున్నారు కానీ అధికారులను నియమించడం లేదు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ సిబ్బంది సహకారంతో సంస్థను నడుపుతున్నారు. ప్రజల యొక్క డబ్బు బంగారం ఈ సంస్థలలో ఉంటుంది. దానికి జవాబిదారితనముగా ఎవరిని నియమించడం లేదు వీరి పైన పర్యవేక్షణ గాని ప్రతి నెల ఆడిటింగ్ గాని లేనందువల్ల ఇటువంటి నేరాలు జరుగుతున్నాయి. కనుక ఇటువంటి ఫైనాన్ సంస్థలకు ఎల్లప్పుడూ పై అధికారుల పర్యవేక్షణలో ఉండాలి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఎవరినైతే ఉద్యోగాలలో తీసుకుంటున్నారో వారి యొక్క పూర్తి వివరాలను మరియు ఎటువంటి నేరాలు లేవన్నటువంటి సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి మరియు వారి వద్ద నుంచి షూరిటీలు పొంది ఉండాలి అప్పుడు వారు ఎటువంటి అవకతవకలకు పాల్పడకుండా ఉంటారు. పై అధికారులు ఎల్లప్పుడూ తనిఖీ చేస్తూ ఉంటే ఇటువంటి నేరాలు జరగకుండా ఉంటాయని ఆశిస్తున్నానని అన్నారు.

ఈ కేసులో ప్రతిభ కనపరచిన తిరుపతి ఈస్ట్ పోలీసు స్టేషన్ సి.ఐ బి.వి.శివప్రసాద్ రెడ్డి, సబ్-ఇన్స్పెక్టర్ ఎ. జయస్వాములు, హెడ్ కానిస్టేబుల్స్ మునిరాజ, రవి, కానిస్టేబుల్స్, ప్రభాకర్, చిరంజీవి ఈస్ట్ పోలీసు స్టేషన్ సిబ్బందిని తిరుపతి జిల్లా ఎస్పీ గారు అభినందిచినారు.

*కేసు వివరాలు:*

2022 వ సంవత్సరం సెప్టెంబర్ నెల 13 వ తేదీన KLM AXIVA FINVEST gold loan private Ltd. కంపెనీ తిరుపతి-తిరుమల బైపాస్ రోడ్, కొర్లగుంట నందు బ్రాంచ్ ఆఫీసు ను ప్రారంబించినారు. ఆ బ్రాంచ్ లో శాంత కుమార్ ను అస్సిస్టెంట్ మేనేజర్ గా బాష ను, సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా జూనియర్ ఎగ్జిక్యూటివ్ గాను లావణ్య ను నియమించినారు. 15 రోజులకు భాష ఉద్యోగమునకు రిజైన్ చేసినాడు. కంపెనీ నందు ఇద్దరే పని చేస్తున్నారు. 31-10-2022 వ తేదీ సోమవారం కంపెని ఆడిటర్ అయిన ఈశ్వర్ ఆడిట్ కు వస్తున్నాడని తెలుసుకొని మేనేజర్ ఐనా శాంతకుమార్ తాను చేసినా అవకతవకలు బయట పడుతాయని 30-10-2022 తేదీ ఉదయం ఆఫీసు ఓపెన్ చేసి సేఫ్ రూం లాకర్ ఓపెన్ చేసి అందులో ఉన్న 36 గోల్డ్ లోన్ల కు సంబందించిన బంగారు మెత్తం 1013.08 గ్రాములు మెత్తం గోల్డ్ లోన్ ఇచ్చిన విలువ Rs.34,58,998/- మరియు కంపెనీలో మిగిలి ఉన్న నగదు తీసుకోని పోయినాడు అని పిర్యాదు చేసినారు.

*నేరం చేదించిన విధానం:*

తిరుపతి జిల్లా యస్.పి శ్రీ పి.పరమేశ్వర రెడ్డి, ఐ.పి.యస్ గారి ఆదేశాల మేరకు ఈ కేసును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తిరుపతి ఈస్ట్ డి.యస్.పి మురళి కృష్ణ గారి పర్యవేక్షణలో తిరుపతి ఈస్ట్ పోలీసు స్టేషన్ సి.ఐ బి.వి.శివ ప్రసాద్ రెడ్డి, యస్.ఐ ఏ.జయస్వాములు మరియు సిబ్బంది బృందాలుగా ఏర్పడి ముద్దాయి గురించి బెంగుళూరు మరియు చెన్నై ప్రాంతాలలో తిరిగి ఈ రోజు రాబడిన కచ్చితమైన సమాచారము మేరకు ముద్దాయి పై నిఘా ఉంచి ఆర్.టి.సి బస్ స్టాండ్ వద్ద వాహనాలను తనికి చేస్తుండగా సుమారు ఉదయం 7.00 AM గంటలకు (19-11-2022 వ తేది) బస్ స్టాండ్ నుండి చింతలచెను పోవు దారి లో, రామతులసి కళ్యాణమండపం వద్ద సదరు మగ వ్యక్తి పోలీసులు అయిన మమ్మల్ని చూసి పారిపోవుటకు ప్రయత్నించగా నేను నా సిబ్బంది సహాయంతో అతనిని చుట్టూ ముట్టి పట్టుకోని, అతనిని వద్ద ఉన్న బ్యాగు గురించి విచారించగా KLM కంపెనీ లోని సేఫ్ లాకర్ ఓపెన్ చేసి తీసుకున్న బంగారు 1013.08 గ్రాములు, Rs. 1,00,000/- నగదును ముద్దాయి నుండి స్వాధీనం చేసుకోవడం జరిగింది.

*ముద్దాయి వద్ద సిజ్ చేసిన వస్తువులు:*

36 గోల్డ్ లోన్ల కు సంబందించిన బంగారు మెత్తం 1013.08 గ్రాములు, మెత్తం గోల్డ్ లోన్ ఇచ్చిన విలువ Rs.34,58,998/- మరియు Rs. 1,00,000/-నగదు

*నేరము చేసిన విధానం:*

ముద్దాయి శాంతకుమార్ KML గోల్డ్ కంపెనీలో మేనేజర్ గా ఉంటూ కంపెనివారిని నమ్మించి కంపెనీకి ఇవ్వవలసిన సేఫ్ లాకర్ రెండవ కీ ని వారికి ఇవ్వకుండా తన దగ్గర ఉంచుకొని తన దగ్గర ఉన్న రెండవ కి సహాయముతో లాకర్ ను ఓపెన్ చేస్తూ కంపెనీ యొక్క లావాదేవీలు నిర్వహిస్తు వారిని నమ్మించి, లాకర్ లో ఉన్న 250 గ్రాముల బంగారమును తీసుకొని తిరుపతిలోని వివిధ గోల్డ్ లోన్ కంపెనీలలో తన బందువుల మీద లోన్ పెట్టి డబ్బులు తీసుకొని తన అవసరాలకు వాడుకున్నాడు. తన బందువులు ఒకసారి వచ్చి కంపెనీలో గోల్డ్ లోన్ పెట్టినప్పుడు వారి యొక్క KYC తీసుకొని తర్వాత వారికి తెలియ కుండనే KLM కంపెనీలో వారి పైన గోల్డ్ లోన్స్ పెట్టీ, ఒక లోన్ లో బంగారంకు బదులు నకిలీ బంగారాన్ని పెట్టి లోన్ తీసుకున్నాడు. కంపెనీ ఆడిటింగ్ కు ఆడిటర్ వస్తున్నాడు అని తెలుసుకొని తన వద్ద ఉన్న రెండవ కి సహాయముతో సేఫ్ లాకర్ లో ఉన్న బంగారాన్ని మరియు నగదు తీసుకొని పరారైనాడు. తదుపరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ముద్దాయిని అరెస్ట్ చేసి రేమాండ్ కు పంపించడం జరిగింది.

ఈ ప్రెస్ మీట్ నందు అడిషనల్ యస్.పి అడ్మిన్ శ్రీమతి ఇ.సుప్రజ మేడం గారు, ఈస్ట్ డి.యస్.పి మురళి కృష్ణ, వెస్ట్ డి.యస్.పి నరసప్ప, సి.ఐ శివప్రసాద్, సబ్-ఇన్స్పెక్టర్ ఎ.జయస్వాములు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!