బస్సుల తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం
జడ్చర్ల: జడ్చర్ల మండల పరిధిలోని పోలేపల్లి సెజ్ లో ఓ ఎలక్ట్రో అనే కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కేంద్రంలో శనివారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తయారీ కేంద్రంలో భారీగా మంటలు చెలరేగి పలు విలువైన వస్తువులు కాలి బూడిదయ్యాయి. ఈ విషయాన్ని వెంబడే జడ్చర్ల ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన సంఘటనా స్థలాన్ని చేరుకున్న సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో కంపెనీలో చెలరేగిన మంటలను ఆర్పారు. మంటలు ఇంకా కాసేపు చెలరేగి ఉంటే పక్కనే ఉన్న గోదాములకు వ్యాపించి నూతనంగా తయారు చేసిన ఎలక్ట్రిక్ బస్సులతోపాటు పలు విలువైన వస్తువులు కాలి బుడదయ్యేవని, రూ. కోట్లలో ఆస్తి నష్టం జరిగి ఉండేదని కంపెనీ సిబ్బంది తెలిపారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ మూలంగానే ఈ ప్రమాదం సంభవించిందని ఫైర్ సిబ్బంది తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై విచారణ చేపడుతున్నట్లు కంపెనీ యజమాన్యం తెలిపింది. మంటలు అర్పిన ఫైర్ సిబ్బందిలో ఏడిఎఫ్ఓ బి. ధర్మ, ఎస్ఎఫ్ ఓ మల్లికార్జున్, ఎల్ఎఫ్ శ్రీకాంత్ రెడ్డి, సిబ్బంది వెంకటయ్య, రవికుమార్, రమణ గౌడ్ తదితరులు ఉన్నారు.