నీకు నువ్వు బదిలీ అయితే ప్రశాంతం లేదంటే నిన్ను బదిలీ చెయ్యడం ఎలానో మాకు బాగా తెలుసు Mr కలెక్టర్

ప్రతినిధి కృష్ణపల్లిసురేష్:- కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న జిల్లా అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఆ యొక్క అధికారులకు కొమ్ముకాస్తున్న జిల్లా కలెక్టర్ ను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆత్మకూరి చిరంజీవి అధ్యక్షతన ధర్నా నిర్వహించడం జరిగింది. ఈయొక్క ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్, సిపిఐ, బిఎస్పి, టిడిపి, సిపిఐ ఎం.ఎల్ రెడ్ స్టార్, ఏబీఎం పార్టీలు, తుడుం దెబ్బ, కెవిపిఎస్, టిఎంఆర్పిఎస్, బీసీ సంఘం, టిఏజిఎస్. ప్రజా సంఘాలు ఎస్ఎఫ్ఐ , ఏఐఎస్ఎఫ్, ఎన్ ఎస్ యు ఐ, పి డి ఎస్ యు, టి ఎన్ ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘాలు, ఏఐవైఎఫ్,, డివైఎఫ్ఐ, యూత్ కాంగ్రెస్ యువజన సంఘాలు, మహిళా సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ యొక్క ధర్నాలో పాల్గొన్న పలువురు నాయకులు మాట్లాడుతూ జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖలలో అవినీతి తాండవిస్తున్నదని, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారుల యొక్క తీరుపై స్పందించాల్సినటువంటి జిల్లా కలెక్టర్ నిమ్మకు నేరెత్తన్నట్లు వివరించడం చాలా బాధాకరమన్నారు. జిల్లాలోని అవినీతిపైన ప్రతిరోజు ఏదో ఒక సంఘటన పత్రికలలో పెద్ద ఎత్తున రాస్తున్నప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. వారికే కొమ్ము కాసే విధంగా కలెక్టర్ వ్యవహిరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మూడు కోట్ల రూపాయల విలువ గల బియ్యం కుంభకోణం ముందుకు మూడు కోట్ల రూపాయలను రికవరీ చేయకుండా, అసలు దొంగలను వదిలేసి కింది స్థాయి ఉద్యోగులపై చర్యలు చేపట్టారు. ఆర్డీవో భూములు , కల్యాణలక్ష్మీ పథకంలో అవినీతికి పాల్పడితే అతనిపై కేస్ నమోదు చేయకుండా దీర్ఘకాలిక సెలవుపై కలెక్టర్ రే స్వయంగా పంపియ్యడం వెనుకాల గల ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నించారు. అంతేకాకుండా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ప్రజాప్రతినిధుల యొక్క తీరుపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల నాయకుల బందువులైన ప్రభుత్వ ఉద్యోగులపై కలెక్టర్ అధికార పార్టీ నాయకుల చెప్పుడు మాటలతో వారిని ఇబ్బందులకు గురిచేయడం సిగ్గుమానిన పని అని తెలిపారు. ఓపెన్ క్యాస్ట్. ముంపునకు గురైన ఉల్లిపిట్ట గ్రామానికి రోడ్లు,ఇళ్ళు, ఫిల్టర్ బెడ్ నిర్మించుకున్న నిర్మించినట్లు చూపి మూడు కోట్ల రూపాయలను కాజేశారని, ఇపుడు ఈ సమస్య నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నందు ఉన్నదని అన్నారు. జిల్లాలో బిడిపిపి, ప్రభుత్వ భూములలో ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్లు వేసి ఇండ్లు నిర్మిస్తున్న చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని కలెక్టర్ పై మండి పడ్డారు. ఇప్పటి వరకు ప్రభుత్వ వసతి గృహలలో అక్కడి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల అనారోగ్య కారణాలతో ఎంతో మంది విద్యార్థులు చనిపోతే కనీసం వారి కుటుంబాలను ఆదుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇసుక, బియ్యం మాఫియా ఆయితే అడ్డు, అదుపు లేకుండా మూడుపులూ, ఆరు కాయలు అనే చందంగా కొనసాగుతున్నదని తెలిపారు. విద్య,వైద్యం ఇక్కడి ప్రజలకు అందని ద్రాక్షలా మారిందని వాపోయారు. ప్రతి ప్రభుత్వ శాఖలలో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల నియామకంలో ఎలాంటి నోటిఫికేషన్ లు లేకుండా భర్తీ చేస్తూ, నోటిఫికేషన్ జారీ అయిన వాటిలో మాములు తీసుకొని ఉద్యోగుల భర్తీ జరుగుతున్నదని అన్నారు. ఒక జిల్లా పాలనాధికారి గా ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన జిల్లా కలెక్టర్, ప్రశ్నించిన వారిని సస్పెండ్ చేస్తూ, అవినీతికి పాల్పడిన వారిని అందలం ఎక్కిస్తున్నారని అన్నారు. కొన్ని ప్రభుత్వ శాఖల అధికారుల తీరు చూస్తే కేవలం ఈ జిల్లాకు దనర్జనే ద్యేయంగా వచ్చినట్లు ఉన్నదని తెలిపారు. జిల్లా కలెక్టర్ కి ఏమాత్రం గౌరవం ఉన్న తనకు తానుగానే బదిలీ చేసుకొని వెళ్లిపోవాలని కోరారు లేనియెడల పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడదామని హెచ్చరించారు. ఈనెల 21న కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించే మహాధర్న కార్యక్రమానికి జిల్లాలోని ప్రతి ఒక్క పౌరుడు హాజరుకావాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కె విశ్వప్రసాద్ డిసిసి అధ్యక్షులు, బద్రి సత్యనారాయణ సిపిఐ జిల్లా కార్యదర్శి, హర్షద్ హుస్సేన్ బీఎస్పీ కాగజ్నగర్ నియోజకవర్గ బాధ్యులు, కొట్నాక విజయ్ కుమార్ తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు, మర్సకొల సరస్వతి మహిళా నాయకురాలు కాంగ్రెస్ పార్టీ, కనక ప్రభాకర్ బీఎస్పీ ఆసిఫాబాద్ నియోజకవర్గ నాయకులు, పెరుగు ఆత్మారాం టిడిపి జిల్లా నాయకులు, రూప్ నార్ రమేష్ బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు, గోగర్ల తిరుపతి సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి, దుర్గం దినకర్ కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి, మాల శ్రీ టి ఏ జి ఎస్ రాష్ట్ర నాయకురాలు, అంబాల రవి టి ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు, కళావతి కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు దుర్గం ప్రవీణ్ బిఎస్పి సిర్పూర్ నియోజకవర్గం నాయకులు మసాడే చరణ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, బొమ్మన ధర్మయ్య మల్లేష్ టి ఎం ఆర్ పి ఎస్ నాయకులు, ఆత్మకూరి చిరంజీవి ఏ ఐ వై ఎఫ్ జిల్లా కార్యదర్శి, గొడిసెల కార్తీక్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, గుండా శ్యామ్ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, దుర్గం రవీందర్ ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి, పోల్కర్ సాయిరాం టి ఎన్ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు, తిరుపతి పి డి ఎస్ యు జిల్లా కార్యదర్శి, బొర్కుటే శ్యామ్ డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు, బావునే వికాస్ ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు, జాఫర్ ఎస్ ఎఫ్ ఐ జిల్లా సహాయ కార్యదర్శి మరియు జావీద్ ఆసిఫ్ పార్వతి సాయి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!