కళమ్మ తల్లి ముద్దు బిడ్డ సూపర్ స్టార్ కృష్ణ కన్ను మూత.

కళమ్మ తల్లి ముద్దు బిడ్డ సూపర్ స్టార్ కృష్ణ కన్ను మూత.

** పొట్టి శ్రీరాములు దీక్షకు మొట్టమొదటిగా మద్దతు తెలిపిన వ్యక్తి కృష్ణ….

** నివాళులర్పించిన జాస్మిన్ స్వచ్ఛంద సేవా సంస్థ

గోకవరం :–కళమ్మ తల్లి ముద్దు బిడ్డ, ఉమ్మడి మద్రాసులో తెలుగు వాళ్ళ కు ప్రత్యేక రాష్ట్రం కావాలని తన ప్రాణాలను అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా దీక్షలో పాల్గొన్న మొట్టమొదటి సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ మరణం నేటికి తెలుగు ప్రేక్షకులకు తీరని లోటుగానే ఉంటుంది అని జాస్మిన్ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ బత్తిని రామకృష్ణ అన్నారు. సూపర్ స్టార్ కృష్ణ మృతికి గోకవరంలో ఆయన సంతాపం తెలుపుతూ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.మహోన్నత విలువలు కలిగిన కలమ్మ తల్లి బిడ్డగా ఉన్న సూపర్ స్టార్ కృష్ణ మరణించటం బాధాకరమైన విషయం అని సూపర్ స్టార్ కృష్ణ జీవితంలో కొన్ని సంఘటన జాస్మిన్ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ బత్తిన రామకృష్ణ గుర్తు చేశారు. కృష్ణ జీవిత ప్రస్థానంలో ఎన్నో కీర్తిలు సాధించిన ఘనత ఆయనకే దక్కుతుంది. గుంటూరు జిల్లా తెనాలి మండలం బర్రి పాలెం గ్రామానికి చెందిన ఘట్టమనేని వీర రాఘవయ్య నాగరత్నమ్మ లకు ది:31–05–1947 న మొదటి కుమారుడు గా కృష్ణ జన్మించారు. ఆయన అసలు పేరు శివరామకృష్ణ మూర్తి, కృష్ణ జననం.. 1965 సంవత్సరంలో తేనె మనసులు సినిమాతో హీరోగా సినీరంగ ప్రవేశం చేసిన కృష్ణ..2016 లో శ్రీ శ్రీ చిత్రం చివరి సినిమా….. తన కెరీయార్ లో మూడవ చిత్రంగా గూడచారి 117.. మోసగాళ్లకు మోసగాళ్లు తో సినీ ఇండస్ట్రీలో ప్రభంజనం సృష్టించిన కృష్ణ..ఆంధ్రా జేమ్స్ బాండ్ గా గుర్తింపు పొందారు..1974 లో నంది అవార్డు అందుకున్నారు .. 350.. సినిమాలు తీసిన కృష్ణ..తెలుగు ఇండస్ట్రీలో మొట్టమొదటి ఈస్ట్ మాన్ కలర్ సినిమా అల్లూరి సీతారామరాజు,70 ఎమ్ ఎమ్ కాలర్ సినిమా సింహాసనం లో కృష్ణ చరిత్ర సృష్టిచిన కృష్ణ.. 1983లో పద్మాలయ స్టూడియో నిర్మాణం,,16 చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.1976 లో కేంద్ర కార్మిక శాఖ ద్వారా నట శేఖర్ గుర్తింపు తో సత్కారం..2008లో ఆంధ్ర యూనివర్సిటీ ద్వారా గౌరవ డాక్టరేట్ ప్రధానం.. 2009లో కేంద్ర ప్రభుత్వం ద్వారా పద్మభూషణ్ పురస్కారం అందుకున్న కృష్ణ..2500 అభిమాన సంఘాలు సంపాదించు కున్న సూపర్ స్టార్ కృష్ణ .దివంగత నేత భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పిలుపుమేరకు రాజకీయ రంగ ప్రవేశం చేసిన కృష్ణ..1989లో ఏలూరు ఎంపీగా విజయం సాధించిన కృష్ణ..1972లో ఆంధ్రప్రదేశ్లో కరువు వచ్చిన సందర్భంగా తోటి కళాకారులు అందర్నీ ఒక వేదిక మీద తీసుకువచ్చి విరాళాల సేకరించి ప్రభుత్వం తరఫున కరువు బాధితులను ఆదు కోవడంలో కీలక పాత్ర పోషించిన ఘనత సూపర్ స్టార్ కృష్ణ కే దక్కింది.. తెలుగు వీర లేవరా అంటూ అల్లూరి సీతారామ రాజు చిత్రం ద్వారా..నేడే ఈనాడే అంటూ ఈనాడు చిత్రం ద్వారా దేశభక్తిని చాటుకున్న సూపర్ స్టార్ కృష్ణ..ఈనాడు నాదేశం ప్రభంజనం వంటి అనేక ఉత్తేజ భరితమైన చిత్రాలను తీసిన కృష్ణ..నీ బుగ్గ మీద గోరు చుక్కలు ఏంటబ్బా అంటూ యువతను వజ్రాయుధం సినిమా ద్వారా..ఆకాశంలో ఒక తార అంటూ సింహాసనం సినిమా ద్వారా..ఈ గాలిలో ఎక్కడో అలికిడి అంటూ అగ్నిపర్వతం సినిమా ద్వారా యువతను కేరింతలు కొట్టించిన ఘనత సూపర్ స్టార్ కృష్ణ కే దక్కింది.. అగ్గిపెట్టి ఉందా అంటూ అగ్నిపర్వతం సినిమాలో జమదగ్నిగా తను చెప్పిన డైలాగ్ నేటికీ హైలెట్ గానే నిలిచింది..తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న ఘనత సూపర్ స్టార్ కృష్ణ కే దక్కిందని ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటూ. జాస్మిన్ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ బత్తిన రామకృష్ణ తన సంతాపంలో కోరారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!