స్మశాన వాటికలో కంప చెట్లు తొలగింపునకు చర్యలు చేపట్టిన వైసిపి నాయకులు కొండా మధుసూదన్ రెడ్డి
స్టూడియో 10 టీవీ న్యూస్, నవంబర్ 16, మహానంది; మహానంది మండలం మేజర్ గ్రామపంచాయతీ గాజులపల్లి పరిధిలోని బసాపురం గ్రామంలోని హిందూ స్మశాన వాటికలో దట్టంగా పెరిగిన కంపచెట్లను తొలగింపు పనులను జెసిపి సహాయం తో వైసిపి నాయకులు కొండా మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం చేపట్టారు. బసాపురం గ్రామంలోని హిందూ స్మశాన వాటికలో దట్టంగా కంప చెట్లు పెరిగిపోయి సమాధుల దగ్గరకు వెళ్లేందుకు ఇబ్బందికరంగా ఉందని గ్రామస్తులు వైసిపి నాయకులు కొండా మధు సూదన్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే ఆయన స్పందించి పదివేల రూపాయల తన సొంత ఖర్చులతో దట్టంగా పెరిగిన కంపచెట్లను వెంటనే తొలగించారు. ఈ సందర్భంగా కొండ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధే తమ లక్ష్యంగా పనిచేస్తున్నానని అన్నారు.ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా బీసీ సంఘం యువజన,వాల్మీకి సంఘం నాయకుడు బోయ నారాయణ,గ్రామ నాయకుడు బుజ్జయ్య, మాజీ ఎంపిటిసి రమణ, నాలుగవ వార్డ్ మెంబర్ జమ్ములు,సర్వయ్య, మునెన్న,తదితరులు పాల్గొన్నారు.