వాహనదారులకు తప్పని తిప్పలు…
పలుసార్లు ఆర్ అండ్ బి అధికారులకు వినతి పత్రం ఇచ్చిన పట్టించుకోని వైనo
ఇప్పటికైనా ఆర్ అండ్ బి అధికారులు స్పందించి రోడ్ కి ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించాలని జోగులాంబ గద్వాల జిల్లా బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు డిమాండ్….
అయిజ రూరల్:జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం నుంచి ఎక్లాస్పురం,గొర్లఖాన్దొడ్డి గ్రామాల మీదుగా గట్టుకు వెళ్లే ప్రధాన రహదారి కి ఇరువైపులా కంప చెట్లు ఉనందున వాహనదారులకు ఇబ్బంది పడుతున్నారు… ఈ రహదారిపై రోజుకు వేల సంఖ్యలలో నిత్యం స్కూల్ బస్సులు,ఆటోలు,గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు,రైతులు రవాణా కొరకు వినియోగించే ప్రతి వెహికల్స్ వెళ్తూ ఉంటాయి అని జోగులమ్మ గద్వాల బీసీ సంఘం అధ్యక్షులు తట్టే మహేష్ అన్నారు..
జోగులాంబ గద్వాల జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ….అయిజ నుండి గట్టు వరకు వెళ్లే ప్రధాన రహదారుకు చాలా ఇబ్బందిగా మారింది…ఈ విషయంపై పలుసార్లు గ్రామ ప్రజలతో కలిసి ఆర్ అండ్ బి అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన స్పందన లేదు అని తట్టే మహేష్ అన్నారు. రోడ్ కి ఇరువైపులా కంప చెట్లు ఉన్నందున స్కూల్ బస్సు డ్రైవర్లకు, వాహనాదారులు త్రీవ ఇబ్బందిగా మారిందని, యాక్సిడెంట్లు కూడా ఎక్కువ అవుతున్నాయి అని అన్నారు.జిల్లాలో చాలా రహదారులు ఇలానే ఉన్నాయని అన్నారు… ఇప్పటికైనా ఆర్ అండ్ బి అధికారులు స్పందించి అన్ని గ్రామాలకు కూడా సందర్శించి ప్రధాన రహదారులన్నీ వెడల్పు చేయాలని జోగులాంబ గద్వాల జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు తట్టే మహేష్ ఆర్ అండ్ బి అధికారులను కోరారు.