అధ్వానంగా మారిన రహదారి
తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు
స్టూడియో 10 టీవీ న్యూస్ నవంబర్ 14, మహానంది:
మహానంది మండలం మేజర్ గ్రామ పంచాయితీ గాజులపల్లి గ్రామ పరిధి బసాపురం సమీపంలోని చెరువు కట్టకు వెళ్లే రహదారి అత్యంత దుర్భరంగా తయారైంది.ఈ రహదారిలో రైతులు నిత్యం తమ పంట పొలాలకు రాకపోకలు సాగిస్తుంటారు.ఈ రోడ్డు పాడవడంతో రైతులు నడవాలంటే రైతుల అవస్థలు వర్ణనాతీతం. అక్కడ స్థానికంగా ఉండే రైతులు మాట్లాడుతూ రాత్రిపూట ట్రాక్టర్ల ద్వారా మట్టి రవాణా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారిలో రైతులు నడవాలంటే చాలా కష్టంగా ఉందని. ద్విచక్ర వాహనాలపై రైతులు వెళ్లేటప్పుడు అద్భుతప్పి కింద పడి ఎక్కడ ప్రమాదాలు చోటు చేసుకుంటాయని రైతులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకో వాలని స్థానిక రైతులు, ప్రజలు కోరుతున్నారు.