అవినీతి పై చేసే పోరాటానికి సహకరించాలని ప్రజా సంఘాల నాయకుల వినతిపత్రం

జర్నలిస్ట్ కృష్ణపల్లిసురేష్:- విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పలు ప్రభుత్వ శాఖలలో జరిగిన అవినీతి అక్రమాల పై వెంటనే విచారణ జరిపించి జిల్లా కలెక్టర్ ను బదిలి చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి యువజన సంఘల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశ నిర్ణయాల మేరకు సోమవారం రోజున స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసర్ సి.హెచ్.రాణా ప్రతాప్ కి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వివిధ శాఖల లో అవినీతి పెరుగుతున్నప్పటికి జిల్లా కలెక్టర్ వారి పై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని వెంటనే అవినీతి కి పాల్పడిన అధికారుల మీద సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించి, జిల్లా కలెక్టర్ ను బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ చేస్తున్న శాంతియుత పోరాటాలకు సహకరించగలరని కోరడం జరిగింది. వినతిపత్రం ఇచ్చిన వారిలో AIYF జిల్లా కార్యదర్శి ఆత్మకురి. చిరంజీవి. KVPS జిల్లా కార్యదర్శి దుర్గం.దినకర్, పిడిఎస్యు జిల్లా కార్యదర్శి జగజ్పుల తిరుపతి టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పోల్కర్ సాయిరాం టి.ఎం.ఆర్.పి.ఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మెన ధర్మయ్య ఉన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!