పత్రికా ప్రకటన యర్రగొండపాలెం, తేదీ 11.11.2022. రెండో శనివారం, ఆదివారాలు, మరియు ప్రభుత్వ సెలవు దినాలలో ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు క్లాసులు నిర్వహించడం చట్టరీత్యా నేరమని ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్ (PTLU ) నియోజకవర్గ కన్వీనర్ గుమ్మా రాజయ్య శుక్రవారం ఒక ప్రకటన లో తెలిపారు. యర్రగొండపాలెం పట్టణం లో కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ సెలవు దినాలలో క్లాసులు నిర్వహిస్తున్నట్లు తమకు పిర్యాదులు వస్తున్నాయని, అలాగే వర్క్ షాప్ పేరుతో సిబ్బందిని విధులకు రప్పించి వారి చేత పనిచేయించడం ప్రైవేట్ ఉపాధ్యాయుల హక్కులను కాలరాయడమేనని రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి కైనా కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు తమ తీరును మార్చుకోవాలని హితపు పలికారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి సెలవు దినాలలో సిబ్బంది చేత పని చేయించినా, క్లాసులు నిర్వహించినా ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్ PTLU ఆధ్వర్యంలో అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇట్లు గుమ్మా రాజయ్య ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్ (PTLU) యర్రగొండపాలెం నియోజకవర్గ కన్వీనర్