మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ
మహానంది క్షేత్రానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు
స్టూడియో 10 టీవీ న్యూస్, నవంబర్ 09, మహానంది:
మహానంది పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం కొరకు జె ఎస్ డబ్ల్యూ వారి సహకారంతో రూ.27 లక్షల నిధులతో మరుగుదొడ్ల నిర్మాణానికి జె ఎస్ డబ్ల్యూ సిమెంట్ కంపెనీ ప్లాంట్ హెడ్ హుకుంచంద్ గుప్తా బుధవారం భూమి పూజ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో దర్శనానికి వస్తుందండ టంతో భక్తులకు మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టినట్టు ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఉండేందుకు అని చర్యలు తీసుకుంటు న్నామన్నారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ కొమ్మా మహేశ్వర్ రెడ్డి, ఏఈఓ ఎర్రమల మధు సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు,జె ఎస్ డబ్ల్యూ అసిస్టెంట్ ఆఫీసర్ భాస్కర్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.