*పినపళ్ళ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ శుక్లా*
— అంబేద్కర్ కొనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్సుశుక్లా…
— కొత్తపేట రెవిన్యూ డివిజనల్ అధికారి ముక్కంటీ..
*_అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం పినపళ్ళ గ్రామంలో కొత్తపేట రెవిన్యూ డివిజనల్ అధికారి ముక్కంటి, తాసిల్దార్ జి.లక్ష్మీపతి, ఎంపీడీవో కే.జాన్ లింకన్, వ్యవసాయ సహాయ సంచాలకులు కాకి నాగేశ్వరరావు సమక్షంలో జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా సోమవారం రైతు భరోసా కేంద్రాలను పరిశీలించి, ఆలమూరు మండలంలో పినపళ్ళ గ్రామంలో గ్రామ సర్పంచ్ సంగీత సుభాష్ తో కలిసి మొదటగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను మొదలు పెట్టడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ఖరీఫ్ సీజన్ 2022 -23, సంవత్సర కాలం నందు మీ సమక్షంలో మీ గ్రామంలోనే రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రతి రైతు కూడా తన పంటని కనీస మద్దతు ధర కన్నా తక్కువకు అమ్ముకోవాల్సిన అవసరం లేదని దళారులు లేక మధ్యవర్తులు,మిల్లర్ల చేతిలో మన రైతన్నలు నష్టపోకూడదని ఎటువంటి మోసాలకు తావు ఉండకూడదని రైతు భరోసా కేంద్రాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలుగా కూడా పని చేస్తాయని ఈ కేంద్రాల ద్వారా కనీస మద్దతు ధరకు రైతులు తమ ధాన్యాన్ని విక్రయించుకోవచ్చుఅని ఆయన తెలియజేశారు.మద్దతు ధర పొందుటకు పాటించవలసిన నాణ్యతా ప్రమాణాలు గురించి రైతు భరోసా కేంద్రాల్లో తెలుసుకోవాల్సిందిగా వారు కోరారు.అనంతరం రెవెన్యూ డివిజనల్ అధికారి ముక్కంటి మాట్లాడుతూ ఈ క్రాఫ్ నందు నమోదు చేసుకొని ఈ కేవైసీ పూర్తి అయిన రైతులు,తమ ధాన్యము విక్రయించుటకు సిద్ధమైన రైతుల వద్ద నుండి మాత్రమే ధాన్యము కొనుగోలు చేయబడినని ఆయన తెలియజేశారు.అలాగే వ్యవసాయ సహాయ సంచాలకులు కాకి నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రం నందు గల టెక్నికల్ సిబ్బంది ధాన్యం నాణ్యతను పరిశీలించుటకు రైతుల పొలంలో కళ్ళం వద్దకే వచ్చి ధాన్యం నాణ్యతను పరిశీలించెదరని వారు ఏ రోజు వస్తారో కూపన్ ద్వారా తెలియపరుస్తారని, రైతన్నలు రైతు భరోసా కేంద్రం నుండి కూపన్ ఖచ్చితముగా తీసుకొనవలేనని, భారత ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను అనుసరించి రైతు భరోసా కేంద్రాల వద్ద గల ధాన్యం కొనుగోలు సిబ్బంది ఐదు నాణ్యతా ప్రమాణాల పరీక్షలను అంటే (వ్యర్థపదార్థాలు,రంగుమారి,కుచించుకు పోయిన,తక్కువ శ్రేణి గింజలు లేదా కేళీలు మరియు తేమ పరీక్ష) నిర్వహించి,నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తారని రైతు విక్రయించిన ధాన్యము వాటి విలువ తదితర వివరములతో కూడిన రశీదు (ఎఫ్టిఓ) కొనుగోలు సమయములో ఇవ్వడం జరుగుతుందని రశీదు ఖచ్చితముగా తీసుకోవలెనని ధాన్యం విక్రయించిన రైతులకు 21 రోజులలోపు వారి ఖాతాలలో డబ్బులు నేరుగా జమ చేయబడుతుందని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై డిఏం తులసి,డిసిఓ ఏ.రాధాకృష్ణ, వ్యవసాయ సహయ సంచాలకుల జేడి వై అనంత కుమారి,అగ్రికల్చర్ ఏడిఎం విశాలాక్షి,అమలాపురం డిటిఓ అశోక్ ప్రతాప్ రావు, అలమూరు ఎస్సై ఎస్ శివప్రసాద్, వివిధ శాఖల అధికారులు,రైతులు,తదితరులు పాల్గొన్నారు._*