తాగునీటి కోసం బోరు వేయించిన గ్రామ సర్పంచ్:సువర్ణనమ్మ
👉 బోరులో నుండి నీరు వస్తున్న దృశ్యం
చింతలకుంట; జోగులాంబ గద్వాల జిల్లా కేటి దొడ్డి మండలంలోని చింతలకుంట గ్రామపంచాయతీ లో మంచినీటి సమస్య ఉన్నదని చెప్పగానే గ్రామ పంచాయతీ నిధులతో బోరు వేయించిన గ్రామ సర్పంచ్ సువర్ణమ్మా. బుధవారం చింతలకుంట గ్రామ సర్పంచ్ సువర్ణమ్మా గ్రామ సెక్రటరీ మరియు గ్రామ అధికారుల ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ టెంకాయ కొట్టి బోర్ ను ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ సువర్ణము మాట్లాడుతూ..మిషన్ భగీరథ నీరు రాకపోవడానికి ముఖ్య కారణం ఎత్తైన ప్రాంతంలో గ్రామం ఉండటంతో నీరూ వాటర్ ట్యాంకులోకి ఎక్కడం లేదన్నారు.అందుకోసమే బోర్ వేయించడం వాటర్ రావడంతో గ్రామ వాసులు సంతోషం వ్యక్తం చేస్తూ నీటి సమస్య కొరవడుతున్న సమయంలో బోర్ వేయించి ఆదుకున్నందుకు ఎల్ల వేళలా రుణపడి ఉంటామని అందుకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామఅధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.