హైదరాబాద్: తెలంగాణలో గ్రానైట్ వ్యాపారుల ఇళ్లలో ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయి. గ్రానైట్ వ్యాపారులు ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలు వస్తోన్న క్రమంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. గతంలోనే 8 ఏజెన్సీలకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్, కరీంనగర్లో ఈడీ, ఐటీ సంయుక్తంగా సోదాలు జరుపుతున్నాయి. కరీంనగర్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఇంటి వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మంకమ్మ తోటలో ఆయనకు సంబంధించిన శ్వేత గ్రానైట్, కమాన్ ప్రాంతాల్లో ఉన్న మహావీర్ గ్రానైట్లోనూ తనిఖీలు చేపట్టారు.