మహానందిలో కోటి దిపోత్సవం
స్టూడియో 10 టీవీ న్యూస్, నవంబర్ 07, మహానంది:
మహానంది క్షేత్రంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని సొమవారం రాత్రి ఆలయం ప్రాంగణంలో కోటి దీపోత్సవాన్ని ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి, ట్రస్టు బోర్డు చైర్మన్ కొమ్మా మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఆలయం ప్రాంగణంలోని ముఖద్వారం ముందు జ్వాలాతోరణం,కోటి దీపోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు వేలాదిగా తరలి వచ్చారు.భక్తుల సమక్షంలో గర్భాలయంలో అఖండ దీప పూజ చేసి అందులోని జ్యోతిని స్వీకరించి ప్రదక్షిణంగా కోనేరు వద్దకు వచ్చి నదిహారతి ఇచ్చి ఉత్సవమూర్తులతో రాజగోపురం వద్ద శాస్త్రోక్తంగా జ్వాలా తోరణ పూజ, ఉత్సవమూర్తి పూజ, భక్తులతో స్వయంగా కోటి దీపోత్సవం వైభవంగా జరిపారు. సహకరించిన దాతలు లక్కబోయిన ప్రసాద్, అవ్వారు గౌరీనాథ్ దంపతులు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటీఫీకేషన్ డైరెక్టర్ డి .నాగభూపాల్ రెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త శిల్పా భువనేశ్వర్ రెడ్డి దంపతులు, నంద్యాల డివిజన్ విద్యుత్ శాఖ ఈ ఈ రమణ రెడ్డి దంపతులు, మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సవ్వా శరభరెడ్డి, నంద్యాల ట్రాఫిక్ ఎస్ఐ దేవేంద్ర కుమార్, ఎస్సై నాగార్జున రెడ్డి దంపతులు, తాసిల్దార్ జనార్దన్ శెట్టి, విద్యుత్ శాఖ ఏఈ ప్రభాకర్ రెడ్డి, ఏఈవో ఎర్రమల మధు, ఆలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.