ప్రభుత్వ పారదర్శక పాలన
* ప్రజలకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భరోసా
* నూటికి నూరు శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం
* మహా పాదయాత్రలో ఎంపీపీ మోహిత్ రెడ్డి
* కుంట్రపాకం పంచాయతీలో..
* రూ.కోటి నిధులతో అభివృద్ధి పనులు
తిరుపతి న్యూస్:-
గడపగడపకు మహా పాదయాత్రలో భాగంగా తిరుపతి రూరల్ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చేపట్టిన కార్యక్రమంలో ఏ గడపకు వెళ్ళినా ప్రభుత్వ పారదర్శక పాలన, సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాలు అమలు పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం 9 గంటలకు మహా పాదయాత్రలో భాగంగా మోహిత్ రెడ్డి గడపగడపకు పర్యటించారు. కుంట్రపాకం పంచాయతీలోని నాగూరు కాలనీ, శ్రీరామపురం, ఎగువ చేనేతపల్లి, దిగువ చేనేత పల్లి, కొత్త ఇల్లు, కుంట్రపాకం, కుంట్రపాకం హరిజన వాడ, ఎస్టీ కాలనీ, కుంట్రపాకం అరుంధతి వాడ గ్రామాలలో మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, స్థానిక పార్టీ శ్రేణులతో కలిసి ఎంపీపీ ప్రతి గడపకు వెళ్లి ప్రజలతో మమేకమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గురించి వివరించారు. వారి సమస్యలు తెలుసుకుంటూ, వారు పొందుతున్న లబ్ధి తెలియజేస్తూ.. పథకాల బుక్ లెట్ ను వారికి అందజేశారు. అంతకుముందు నాగూరు కాలనీలో సర్పంచ్ సర్పంచ్ శుభ పద్మనాభ రెడ్డి, కరమాల వల్లీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ముస్లిం సాంప్రదాయ పద్దతుల్లో చేతి కంకణం, నియాజ్ టోపీ, నమాజ్ షాల్ తో ఘనంగా సత్కరించి గౌరవించారు. గజమాలలతో సత్కారం, పూల వర్షం కురిపిస్తూ.. హారతులు పట్టిన ప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఎమ్మెల్యే చెవిరెడ్డి కి బాసటగా..
గడప గడప కు మహా పాదయాత్రలో ఎమ్మెల్యే చెవిరెడ్డి తనయుడిగా, ఆయన సేవలకు అభినందనలు చూపుతూ ఆదరిస్తున్న ప్రజలకు రుణపడి ఉంటామని ఎంపీపీ మోహిత్ రెడ్డి మీడియా సమావేశంలో అన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి కి బాసటగా ఉంటామని భరోసా కల్పిస్తుండటం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కుంట్రపాకం పంచాయతీ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఇప్పటికే రూ 1 కోటి నిధులతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలియజేశారు.
ఇవీ అభివృద్ధి పనులు
కుంట్రపాకం పంచాయతీలో రూ.1 కోటికి పైగా నిధులతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. నాగూర్ కాలనీ, కుంట్రపాక హరిజనవాడలో రూ.51 లక్షలతో సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టామన్నారు. అలాగే నాగూర్ కాలనీ శ్రీరామపురం స్మశాన వాటికలు అభివృద్ధికి రూ.24.50 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. కుంట్ర పాకం, నాగూర్ కాలనీలో గ్రామ వేదికలు ఏర్పాటు చేశామన్నారు. అంతే కాకుండా రోడ్డు మరమ్మతులకు, గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి రూ. 30 లక్షలు వెచ్చించామని వెల్లడించారు. మరికొన్ని అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నట్లు వివరించారు. అనంతరం ప్రజలు తమ వినతులు తెలియజేశారు. ప్రధానంగా నాగూర్ కాలనీలో కాలువల నిర్మాణానికి విన్నవించారు. నిరుపేదలకు ఇళ్లు పథకం కింద ఇంకా పట్టాలు జారీ చేయలేదని తెలియజేశారు. మరికొందరు రెవెన్యూ సమస్యలను ఎంపీపీ దృష్టికి తీసుకెళ్లారు. వెంట నడుస్తున్న అధికారులతో అప్పటికప్పుడే మాట్లాడిన ఎంపీపీ పరిష్కారానికి కృషి చేశారు.
వైస్ ఎంపీపీ విడుదల మాధవరెడ్డి, కుంట్రపాకం పంచాయతీ సర్పంచ్ శుభ పద్మనాభ రెడ్డి, ఉప సర్పంచ్ మురళి, కరమాల వల్లీ, ఎంపీటీసీ రెడ్డయ్య, బుచ్చిరెడ్డి, అవినాష్, తోకల కేశవ రెడ్డి, రంజిత్ కుమార్ రెడ్డి, భక్తవత్సల రెడ్డి, ఎం.బాబు, చంద్రా రెడ్డి, ఎం. రాజా రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, గురుధర్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, వసంత, దనమ్మ, శ్రావణ్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు..