రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు
స్టూడియో 10 టీవీ న్యూస్, నవంబర్ 05, మహానంది:
మహానంది మండల పరిధిలోని బోయలకుంట్ల మెట్ట గాజులపల్లి- నంద్యాల జాతీయ రహదారి వద్ద తుఫాన్ వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న సంఘటన శనివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరిలో ఒకరికి కాలు విరిగింది. ఇంకొకరికి స్వల్ప గాయాలయ్యాయి వీరిని అక్కడి స్థానికులు గాజులపల్లి ప్రైవేటు వైద్యశాలలకు తరలించారు.మండల సర్వ శిక్ష అభియాన్ ఏఈ శంకర్ రెడ్డికి కాలు పెరిగింది. గాజులపల్లి గ్రామంలోని సచివాలయం 1లో ఇంచార్జ్ , అసిస్టెంట్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్న విజయ్ కుమార్ రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎస్ఐ నాగార్జున రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని తీవ్ర గాయాలైన సర్వ శిక్ష అభియాన్ ఏఈ శంకర్ రెడ్డిని మెరుగైన వైద్యం కోసం నంద్యాల రాయలసీమ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. తుఫాన్ వాహనాన్ని మహానంది పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఈ సందర్భంగా అక్కడ స్థానికులు మాట్లాడుతూ బోయల కుంట్ల నాలుగు రోడ్డు కూడలి వద్ద స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం వల్ల ఎదురెదురుగా వచ్చే వాహనాలు వేగంతో వస్తూ అదుపుతప్పి ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అక్కడి స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.