అభివృద్ధికి,సంక్షేమానికి మారుపేరు జగనన్న..
గ్రామాలలో సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత…
సీతారాంపురం గ్రామంలో 3.78 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు…
శ్రీకృష్ణపట్నం గ్రామ అభివృద్ధికి 4 కోట్ల 35 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు…
శ్రీకృష్ణపట్నం గ్రామంలో 20 లక్షల రూపాయల నిధులతో చేపట్టే సిసి రోడ్లు,డ్రైన్ల పనులకు శంకుస్థాపన..
శ్రీకృష్ణపట్నం గ్రామం సచివాలయం నందు ఆధార్ సెంటర్ ప్రారంభోత్సవం
గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా…
రాష్ట్రంలో లబ్ధిదారుల చెంతకు నేరుగా సంక్షేమ పథకాల అందించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని తూర్పుగోదావరి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు రాజానగరం శాసన సభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు..
శుక్రవారం నాడు రాజానగరం మండలంలో సీతారామపురం, శ్రీకృష్ణపట్నం గ్రామంలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వము కార్యక్రమంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంబంధిత అధికారులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ సంక్షేమ పథకాల ప్రతి ఒక్కరూ వినియోగించుకుని ఆర్థిక ప్రగతి సాధించాలని సూచించారు..
గత ప్రభుత్వంలో పెన్షన్ల కోసం కాళ్లరిగేలా తిరిగే పరిస్థితి ఉండేదని నేడు వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి నెల ఒకటో తారీఖున పెన్షన్లు అందించడం జరుగుతుందన్నారు..
అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందని చిట్టచివరి లబ్ధిదారుడికి కూడా సంక్షేమ పథకాలు అందించాలనేది సీ.ఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు.
ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించే విధంగా అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు.శ్రీకృష్ణపట్నం గ్రామంలో అవసరమైన చోట డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
శ్రీకృష్ణపట్నం గ్రామంలో సుమారు 20 లక్షల రూపాయల నిధులతో చేపట్టే సిసి రోడ్లు,సిసి డ్రైన్ల నిర్మాణ పనులకు సంబంధించి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా శంకుస్థాపన చేశారు.
శ్రీకృష్ణపట్నం సచివాలయం నందు ఆధార్ నమోదు కేంద్రం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రారంభించారు.
శ్రీకృష్ణపట్నం గ్రామంలో ఇంటి నిర్మాణానికి హౌసింగ్ లోన్ ఇప్పించాలని ఎక్కువమంది తన దృష్టికి తీసుకురావడం అర్హత ఉంటే వెంటనే హౌసింగ్ లోన్ ఇచ్చే విధంగా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు ఎమ్మెల్యే రాజా సూచించారు..
గతంలో శ్రీకృష్ణపట్నం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కొంతమందికి రేషన్ అందడం లేదని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దృష్టికి తీసుకురాగా నేడు లబ్ధిదారులకు రేషన్ సరుకులు అందజేశారు
ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి కోసం అనునిత్యం పాటుపడుతున్న వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లవేళలా వెన్నంటే ఉండాలని ఆయన కోరారు.