తోరిగడ్డ కాలువలపై బొబ్బిలంక పంపింగ్ హౌస్ నిర్మాణం కోసం 91.10 కోట్లు మంజూరు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు..
రైతుల ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం కోసం,తోరిగడ్డ కాలువ విస్తరణకు,పటిష్టమైన,ఎత్తయిన గట్లు నిర్మాణం కోసం మరొక 53.30కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయండి…
సీఎం జగన్మోహన్ రెడ్డికి విన్నపించిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా…
ఎంతోకాలంగా రైతంగాన్నీ మోసం చేసిన ప్రభుత్వాలకు దీటుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి రైతాంగ సంక్షేమానికి అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తున్నారని రాజానగరం ఎమ్మెల్యే తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జక్కంపూడి రాజా తెలిపారు.
శుక్రవారం గోకవరం మండలం గుమ్మళ్ల దొడ్డి గ్రామం నందు అస్సాగో ఇండస్ట్రీస్ ప్రవేట్ లిమిటెడ్ ఇథనాల్ జీరో బేస్డ్ ఉత్పత్తి పరిశ్రమ శంఖుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మర్యాద పూర్వకంగా కలిసి నియోజకవర్గ సమస్యలపై కొంతసేపు చర్చించారు.
రాజానగరం నియోజకవర్గంలోని జరుగుతున్న అభివృద్ధి పనుల పనుల పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు
సీతానగరం మండలం బొబ్బిలంక లోని తోరిగడ్డ కాలువపై ఈ పంపింగ్ స్కీం నిర్మాణం జరుగుతుందన్నారు.దీనివలన
కోరుకొండ మరియు సీతానగరం మండలం పరిధిలోని 13 గ్రామాలలో ఉన్న కొన్ని వేల రైతులకు సంబంధించిన 20 వేల ఎకరాల విస్తీర్ణం లోని పంట పొలాలు ముంపునకు గురి కాకుండా నివారించబడతాయన్నారు
ఈ సందర్భంగా బూరుగుపూడి అయ్యన్నగల్లు వద్ద నుంచి బొబ్బిలంక వరకు గల తోరిగడ్డ కాలువ విస్తరణ పనులు నిమిత్తం 53.30 కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని అంచనా ప్రతిపాదనలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే రాజా అందజేశారు.జల వనరులు శాఖ తయారు చేసిన ఈ అంచనా ప్రతిపాదనల ప్రకారం నిధులు మంజూరు చేయాలని కోరారు.
ఈ నిధులతో కాలువలోని పూడికతీత,కాలువ వెడల్పు, పటిష్టమైన,ఎత్తయిన గట్లునిర్మాణం,కాలువపై ప్రస్తుతం ఉన్న కాజువే- కల్వట్లను తొలగించి దాని స్థానంలో హె-లెవెల్ బ్రిడ్జిల నిర్మాణం చేయడానికి అవకాశం ఉంటుందన్నారు.
ఈ ప్రతిపాదనల ద్వారా గోదావరి ఎగపోటు నీరు లోతట్టు ప్రాంతాలకు చేరదన్నారు.దీనివలన ప్రజలకు రైతాంగానికి మేలు జరుగుతుందన్నారు.
రైతాంగ పంటల ముంపు సమస్య శాశ్వత పరిష్కారంలో భాగంగా రివర్స్ పంపింగ్ స్కీము కోసం 91.10 కోట్ల రూపాయల నిధులు కేటాయించినందుకు సీఎం జగన్మోహన రెడ్డికి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కృతజ్ఞతలు తెలియజేశారు.