నల్లమల ఘాట్ రోడ్డు లో అదుపుతప్పి పాత రైల్వే వంతెన ను ఢీకొన్న లారీ
ఈ ప్రమాదంలో డ్రైవర్ కి తీవ్రగాయాలు అయ్యాయి
స్టూడియో 10 టీవీ న్యూస్ నవంబర్03, మహానంది: మహానంది మండల పరిధిలోని గాజులపల్లి- గిద్దలూరు జాతీయ రహదారి నల్లమల్ల ఘాట్ రోడ్డు నందు గురువారం వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రకాశం జిల్లా దిగుమెట్ట గ్రామ సమీపంలోని నల్లమల అటవీప్రాంతంలో గల పాత రైల్వే వంతెనను లారీ ఢీకొంది. నంద్యాల నుండి గిద్దలూరు వైపు వస్తున్న లారీ అదుపుతప్పి వంతెనని ఢీకొట్టడంతో లారీ డ్రైవర్ క్యాబిన్ లోనే ఇరుక్కుపోయి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ లారీ డ్రైవర్ ను హైవే పోలీసులు గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో నల్లమల అటవీ ప్రాంతంలో గిద్దలూరు- నంద్యాల వెళ్లే వాహనాల రాకపోకలకు రెండు గంటలకు పైగా అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.