తూర్పుగోదావరి గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండల కేంద్రం నందు పార్టీలకతీతంగా పదిహేను సంవత్సరాలు ఏకధాటిగా గ్రామ సర్పంచ్ గా ప్రజలకు విశేష సేవలందించిన పెందుర్తి నాగరత్నం ఆకస్మికంగా మరణించడంతో, జనసేన కార్యకర్తల ద్వారా సమాచారం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకురాలు నా సేన నా వంతు కమిటీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించారు.
ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను సందర్భంగా బత్తుల వెంకటలక్ష్మి తెలియజేస్తూ పెందుర్తి నాగరత్నం రాజకీయాల్లో నిజాయితీగా పనిచేశారన్నారు. ర్టీలకతీతంగా మండల ప్రజలకు ఎన్నో సేవలు అందించి ప్రజలఅభిమానాన్ని పొందిన వ్యక్తిగా నిలిచారన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్ధవ దేహానికి నివాళులర్పించారు. మండల ప్రజలు మంచి ఆత్మీయని కోల్పోయారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పెందుర్తి నాగరత్నం మృతి తీరని లోటని అన్నారు. ఆయన ఎల్లప్పుడూ ఎంతో యాక్టివ్ గా ఉండేవారని విభేదాలు జోలికి పోకుండా ఎక్కడికక్కడ సమర్థవంతంగా హుందాగా ఉంటూ ప్రజలకు సేవలు అందించేవారన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆ భగవంతుడుని కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ కార్యకర్తలు మట్ట వెంకటేశ్వరరావు, గడగొట్టి ప్రశాంత్ చౌదరి, అడ్డాల దొరబాబు, దేవన దుర్గాప్రసాద్, దొడ్డి అప్పల రాజు, తట్టబట్టి గణేష్, కొవ్వలి శివ, పలువురు మండల జనసైనికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.