*పెందుర్తి నాగరత్నం మరణం పేద ప్రజలకు తీరనిలోటు అంటున్న – మద్దాల కొండలరావు*
తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం పేద ప్రజల అభివృద్ధి కోసమే ఆలోచిస్తూ ఎన్నో పదవులను పొంది పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న పెందుర్తి నాగరత్నం ఆకస్మిక మరణం చాలా బాధాకరమని మండల ప్రజలకు తీరనిలోటని మద్దాల కొండలరావు తెలిపారు. ఈ సందర్భంగా కొండలరావు మాట్లాడుతూ 1983లో ఒక చిన్నపాటి కాంపౌండర్ గా పనిచేస్తున్న నన్ను రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి మాజీ ఎస్సీ సెల్ కోరుకొండ మండల ప్రెసిడెంట్ గాను,నియోజకవర్గ కన్వీనర్ గాను, నియోజకవర్గ ప్రచార కమిటీ చైర్మన్ గాను, ప్రచార కమిటీ సమన్వయకర్తగాను,కొన్ని సందర్భాలలో నాకోసమే ప్రత్యేకించి ఎలక్షన్లు జరుపుటలోనూ,స్టేట్ మరియు జిల్లా కమిటీలలో పదవులు పొందే విధంగా ఎంతో సహకారం చేసిన వ్యక్తిగా,ఒక అన్నగా ఒక తండ్రిగా పెందుర్తి నాగరత్నం నాలాంటి వాళ్ళు ఎందరికో పేద ప్రజల అభివృద్ధికి సహకరించారని అన్నారు. ఎలక్షన్లు జరిగే నాలుగు రోజులు మాత్రమే పార్టీల కోసం మాట్లాడుతూ ఆ తర్వాత ప్రజలందరూ నా వాళ్లే అంటూ పేద ప్రజలందరికీ ఎన్నో సేవా కార్యక్రమాలు అందించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఎటువంటి మచ్చలేని వ్యక్తిగా ఆయన రాజకీయ జీవితాన్ని గడిపారని తెలిపారు. జనతా పార్టీలో పనిచేస్తున్న నేపథ్యంలో అప్పుడు నందమూరి తారక రామారావు పిలుపుమేరకు తెలుగుదేశం పార్టీలో అడుగుపెట్టిన నాటి నుండి నేటి వరకు రథసారథిగా పనిచేసిన వ్యక్తి పెందుర్తి నాగరత్నం అని కొనియాడారు. ఈయన పలు రాష్ట్ర,జిల్లాస్థాయి పదవులను సమర్థవంతంగా పనిచేసి ప్రజల నుంచి ఆదరణ అభిమానాన్ని పొందారన్నారు. పేద ప్రజల కోసం అహర్నిశలు పనిచేసిన వ్యక్తిగా నిలిచారన్నారు. మండలంలో ఎన్నో క్రిస్టియన్ చర్చలకు ఎంతగానో సహకారం అందించారని ఎంతోమందిని కులమతాలకతీతంగా రాజకీయాల్లో ముందుకు నడిపించేందుకు సహకారం అందించేవారని ఈ రోజున ఆయన పార్ధవదేహాన్ని చూడడానికి కొన్ని అనివార్య కారణాల వలన వెళ్ళలేని పరిస్థితులు నాకు ఎదురయ్యాయని కొండలరావు కన్నీటి పర్యంతమయ్యారు. రాష్ట్రపతి అవార్డు గ్రహీతగా,సహకార పరపతి సంఘం ప్రెసిడెంట్గా,కస్తూర్బా గాంధీ ఆశ్రమం ట్రస్ట్ చైర్మన్గా,ఏకగ్రీవంగా ములకల్లంక ఎంపీటీసీగా,పలు స్కూల్స్ అభివృద్ధి డైరెక్టర్ గా ప్రజలకు సేవా కార్యక్రమాలు చేశారన్నారు. మండల కేంద్రం సీతానగరంగా ఏర్పడటానికి ప్రధానంగా కృషి చేసిన వ్యక్తి ఈయనే అని అన్నారు. అప్పట్లో ఎమ్మార్వో ఆఫీస్, ఎంపీడీవో ఆఫీస్,పోలీస్ స్టేషన్,ప్రభుత్వ హాస్పటల్ నిర్మాణాలకు నాంది పలికింది నాగరత్నమేనని అన్నారు. ప్రభుత్వ హైస్కూల్ స్థలదాతగా నిలిచారని,తొర్రిగడ్డ పంపిణీ స్కీం అభివృద్ధికి,రైతుల అభివృద్ధికి ఎత్తిపోతల పథకం అభివృద్ధికి ఎంతగానో సహకారం అందించారన్నారు. నేటికీ నేను ఒక వ్యక్తిగా గుర్తింపు పొందగలిగానంటే ఆయన చూపించిన ఆదరణ మాత్రమేనని అన్నారు. ఇప్పుడు ఆ పార్టీలో అలాంటి నాయకులు కనుమరుగైపోతున్నారన్నారు. 15 సంవత్సరాలు ఏకగ్రీవంగా పంచాయతీ సర్పంచ్ గా కొనసాగిన వ్యక్తిగా ఆయన నిలిచారన్నారు. అప్పట్లో డిగ్రీ కాలేజీ అభివృద్ధికి జోలి పట్టి అడిగారని,జూనియర్ కాలేజీ స్థలదాతగా నిలిచారని ప్రభుత్వ హైస్కూల్ అభివృద్ధికి ఎంతగానో సహకరించారని గత కొద్ది సంవత్సరాల వరకూ కస్తూర్బా గాంధీ ఆశ్రమం అభివృద్ధికి ఎంతగానో సహకరించారని అప్పట్లో మండలంలో ఎన్నో గ్రామాల అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. గోదావరి ఉధృక్తత సమయాల్లో ఏటి గట్టు పటిష్టతకు ఎంతగానో శ్రమించారన్నారు. అప్పటి ఎమ్మెల్యే పెందుర్తి సాంబశివరావుతో ఎప్పటికప్పుడు చర్చలు జరిపి ఏటిపట్టి వాసుల రక్షణార్థమై నిద్రాహారాలు మాని అహర్నిశలు పనిచేశారన్నారు. కులమత భేదాలకతీతంగా ప్రజలందరినీ కలుపుకుంటూ ముందుకు సాగేవారని అన్నారు. అప్పటి సీనియర్ నాయకులైన బాలయోగి,వంగా గీత,బొడ్డు భాస్కరరావు,ఎస్ వి కే సత్యనారాయణ వంటి నాయకుల మాట తీసుకుని పేద ప్రజలకు ఉన్నతమైన సేవలందించుటలో పెందుర్తి నాగరత్నం ముందుకు సాగేవారని అన్నారు. నాగరత్నం లేకపోవడం కుటుంబ సభ్యులకు పార్టీ నాయకులకు,కార్యకర్తలకు తీరనిలోటని అన్నారు. ఆయన ఇక లేరు అనే మాట మనసుకు ఎంతో బాధను కలిగిస్తుందని అన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరి ప్రార్థిస్తున్నానని కొండలరావు తెలిపారు.