*మాజీ సర్పంచ్ పెందుర్తి నాగరత్నం కన్నుమూత – పరామర్శించిన బిజెపి స్టేట్ కౌన్సిల్ మెంబర్ వీరన్న చౌదరి*
సీతానగరం : – సీతానగరం పంచాయతీ మాజీ సర్పంచ్ గా,సొసైటీ బ్యాంకు అధ్యక్షునిగా, ఎంపీటీసీగా,జిల్లా కమిటీలో పలు పదవుల్లో పనిచేసిన సీనియర్ నేతగా పెందుర్తి నాగరత్నం ప్రజలకు ఎన్నో సేవలు అందించారని ఈరోజు ఆయన ఆకస్మికంగా మరణించడం చాలా బాధాకరమని బిజెపి స్టేట్ కౌన్సిల్ మెంబర్ నీరుకొండ వీరన్న చౌదరి అన్నారు. ఈ సందర్భంగా వీరన్న చౌదరి తెలియజేస్తూ ఆయన ఇంటికి వెళ్లి పార్థవదేహానికి నివాళులు అర్పించడం జరిగిందన్నారు. ఈయన మరణం బాధాకరమని తెలిపారు. పెందుర్తి నాగరత్నం లేకపోవడం కుటుంబ సభ్యులకు టిడిపి పార్టీ నాయకులకు,కార్యకర్తలకు తీరనిలోటని అన్నారు. పెందుర్తి నాగరత్నం ఎంతోమందికి రాజకీయాలు నేర్పించి వారు ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు అందించుటలో తీర్చిదిద్దిన ఘనత ఈయనకే దక్కిందన్నారు. నాకు వరసకు ఈయన మేనమామ అవుతారని చిన్నప్పుడు నన్ను ఎత్తుకుని తిప్పిన ఈయన నన్ను ఎంతో ఆప్యాయంగా చనువుగా పిలిచేవారనీ ఈయన ఇక లేరు అనే మాట మనసుకు ఎంతో బాధను కలిగిస్తుందని వీరన్న చౌదరి అన్నారు. మండల ప్రజలకు ఎన్నో సేవలు అందించిన అభిమానంతో గ్రామస్తులు ఈయన దేహాన్ని ఊరంతా ఊరేగించిన అనంతరం బర్రెలగ్రౌండ్ కి తీసుకుని వెళ్లి తదుపరి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని తెలిపారు. చిన్ననాటి నుండి ప్రజలకు సేవ చేయాలనే భావంతో రాజకీయాల్లో ఆసక్తి పెరగడానికి ఈయనతో కలిసి తిరిగిన జ్ఞాపకాలే ప్రధానమని అన్నారు. ప్రజలకు ఎటువంటి చిన్న కష్టం వచ్చినా అధికారులతో ముక్కుసూటిగా మాట్లాడి ప్రజలకు సేవా కార్యక్రమాలు చేసేవారని అన్నారు. మేనమామగా ఈయన నాకు ఎంతో ఆప్యాయంగా ఉంటూ పేద ప్రజలకు ఎటువంటి సేవలు అందించాలో ఎల్లప్పుడూ చెబుతూ ఉండేవారన్నారు. నాగరత్నం మృతి పట్ల పలువురు టిడిపి పార్టీ ప్రముఖులు,పలు పార్టీల రాజకీయ నాయకులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.