ఆటో యూనియన్ అధ్యక్షుడిగా చిడిపి బంగారయ్య ఏకగ్రీవంగా ఎంపిక
ఆహ్వానానికి దూరంగా ఉన్నా.. ఆపదకు ముందుంటామంటున్న కార్యవర్గం
సీతానగరం: – సీతానగరం మండల శ్రీ శ్రీ శ్రీ దుర్గా భవాని ఆటో యూనియన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా చిడిపి బంగారయ్య ఎంపికయ్యారు. శివాలయం నందు జరిగిన యూనియన్ సమావేశంలో నూతన కార్యవర్గ సభ్యులుగా ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా భలే బుజ్జియ్య,వైస్ ప్రెసిడెంట్ గా షేక్ అమీర్ జాన్,సెక్రటరీగా గొల్లవిల్లి కృష్ణ, పురుషోత్తపట్నం పాయింట్ మెంబర్గా చిటికిన అన్నవరం,కోరుకొండ పాయింట్ మెంబర్గా సుందరపల్లి నాని,చీపురుపల్లి పాయింట్ మెంబర్గా బండారు శ్రీనివాసు, రాజమహేంద్రవరం పాయింట్ మెంబర్లుగా మేకల నాగేశ్వరరావు,వెరసి హరిబాబులను యూనియన్ సభ్యులు 170 మంది ఆధ్వర్యంలో ఈ ఎన్నిక కాబడిందని అధ్యక్షుడు బంగారయ్య తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు చిడిపి బంగారయ్య తెలియజేస్తూ నేటికి 35 సంవత్సరాలుగా ఈ యూనియన్ కొనసాగుతుందంన్నారు. గడిచిన 30 సంవత్సరాలుగా గౌరవ అధ్యక్షునిగా సేవలు అందించడం జరిగిందని తెలిపారు. ఇన్ని సంవత్సరాల తరువాత యూనియన్ సభ్యులు కోరిక మేరకు ఏకగ్రీవ ఎన్నిక జరిగిందన్నారు. రోడ్డు వెడల్పు చేస్తున్నందున ఆటోల స్టాండు కనుమరుగవ్వడంతో ఈ ప్రధానమైన సమస్యను స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దృష్టికి తీసుకుని వెళ్లి యూనియన్ సభ్యుల జీవనోపాధికై ఇబ్బందులు పడకుండా ఆటో స్టాండ్ ఏర్పాటు కొరకు కృషి చేస్తానన్నారు. యూనియన్ సభ్యులకు ప్రభుత్వం నుంచి వచ్చే ఇన్సూరెన్స్ లు చేయడం జరుగుతుందనీ ప్రయాణికులను గమ్యం చేర్చుటలో అప్రమత్తంగా ఉండాలని వేగంగా వాహనాలను నడపరాదని యూనియన్ సభ్యులకు బంగారయ్య తెలిపారు. ఐక్యతతో యూనియన్ సభ్యులు ఉండాలని మండల అధికారులకు యూనియన్ కార్యవర్గం వారికి క్రమశిక్షణతో సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో కుంచే అచ్యుత రామారావు, దేశాభత్తుల గంగాధర్,పలువురు యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.