*చిన్నకొండేపూడిలో ప్రభుత్వం నిర్మాణానికి తాళం అంటూ వచ్చిన కథనాలు పూర్తిగా అవాస్తవమని వైకాపా నాయకులు ఖండించిన వైనం*
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం చిన్నకొండేపూడి గ్రామం మండల వైస్ ఎంపీపీ ముదునూరి సురేష్ రాజు నివాసం నందు సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో చిన్నకొండేపూడి గ్రామ సర్పంచ్ చెరుకూరి శ్రీనివాస్ పాల్,గ్రామ ఉపసర్పంచ్ చేకూరి సత్తిపండు రాజు, మండల వైస్ ఎంపీపీ ముదునూరి సురేష్ రాజు,చిడిపి బంగారయ్య సోమవారం ఓ ప్రముఖ పత్రికలో వచ్చిన వార్తా కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కావాలనే ఒక మీడియా చిన్నకొండేపూడి వైకాపా నాయకులపై బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా గ్రామ ఉపసర్పంచ్ చేకూరి సత్తిపండు రాజు విలేకరులకు తెలియజేస్తూ ప్రభుత్వ భవనాల బిల్లులు మంజూరు కాక కాంట్రాక్టర్లుగా అవతారమెత్తిన వైసిపి నాయకులు తాళాలు వేయడం అని వార్తలు ప్రచురించడం పై అవాస్తవమని ధ్వజమెత్తారు. కావాలనే అధికార పార్టీ వారు వైకాపా నాయకుల పై బురద జల్లాలనే ఉద్దేశ్యంతోనే ఎల్లో మీడియా ఇలాంటి అవాస్తవ వార్తలను ప్రచురిస్తుందని తెలుగుదేశం పార్టీ మనుగడ కోసం ప్రజలకు తప్పుడు సాంకేతికాలు పంపిస్తుందని అన్నారు. చిన్నకొండేపూడి గ్రామపంచాయతీ నందు సచివాలయాన్ని కాంట్రాక్టర్ నిర్మించారని జనవరిలో స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో భవనాన్ని ప్రారంభించడం జరిగిందని అప్పటనుండి ప్రభుత్వ కార్యకలాపాలు ఆ భవనంలోనే కొనసాగుతున్నయన్నారు. పైబోడి పల్లం రాజు అనే వైసీపీ నాయకుడు పలు ప్రభుత్వ భవనాల నిర్మాణాలను చేపట్టి అప్పుల పాలై గ్రామం వదిలి కనిపించకుండా పోయాడని వార్తలు రాయడం సరికాదని అన్నారు. పిపి రాజు అనే వ్యక్తి ఎటువంటి ప్రభుత్వ నిర్మాణాలు చేపట్టలేదని ఆయన వ్యక్తిగత విషయాలవల్లనే ఎక్కడికో వెళ్లి ఉండవచ్చునని అన్నారు. ప్రజలకు సచివాలయం అంటే ఏమిటో తెలియని సందర్భంలో సచివాలయం రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాకుండా సచివాలయ వ్యవస్థను గ్రామ గ్రామాన నేటి ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టడం జరిగిందని అన్నారు. ఈ సచివాలయ నిర్మాణాలు చేపట్టడానికి ఎంతో ఆదర్శంగా గ్రామ గ్రామాన కాంట్రాక్టర్లు ముందుకు రావడం జరిగిందని అన్నారు. నేటి ప్రభుత్వం పై ఏదో రకంగా బురద జల్లాలనే ఉద్దేశంతోనే కొందరు ప్రభుత్వ భవనాల బిల్లులు వేయడం లేదంటూ కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారంటూ వార్తా ప్రచారాలు ప్రచురిస్తున్నారని దుయ్యబట్టారు. నేటి ప్రభుత్వంలో బిల్లు.. ఘొల్లు అనే ప్రచారాలు కేవలం నేటి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని ఓర్వలేకే అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. జిల్లాస్థాయి అధికారులు త్వరిగతిన బిల్లులు మంజూరు చేయడం వల్లనే ప్రభుత్వ నిర్మాణాలు చేపట్టడానికి గ్రామ గ్రామాన అందరూ ముందుకు వస్తున్నారన్నారు. ఇందుకు సహకారంగా వైసిపి నాయకులు చొరవ చూపుతున్నారన్నారు. ప్రతిపక్షాలు ఎప్పటికప్పుడు లేనిపోని ఆరోపణలు చేస్తూ మీడియా ప్రతినిధులను సైతం తప్పు పట్టిస్తున్నారన్నారు. చిన్నకొండేపూడి గ్రామపంచాయతీ నందు బిల్లులు పూర్తిగా అందడం లేదంటూ కాంట్రాక్టర్లు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారంటూ ప్రభుత్వ భవన నిర్మాణాలకు తాళాలు వేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీల నాయకుల ఆరోపణలతో వాస్తవాలను పూర్తిగా తెలుసుకోకుండా స్థానిక వైకాపా నాయకుల పై బురదజల్లే ప్రయత్నాలు ఇప్పటికైనా మానుకోవాలని సత్తిపండు రాజు అన్నారు. సచివాలయం,వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్,ఆర్ బీ కే నిర్మాణాల బిల్లులు రాలేదని పిపి రాజు కనిపించకుండా వెళ్ళిపోయాడని ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. అసలు పిపి రాజు ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టలేదు మొర్రో అంటే బిల్లులు రాలేదనీ అదృషం అయ్యాడని అనడం ఎంతవరకూ సమంజసమని అన్నారు. పార్టీలో ఒక మంచి కార్యకర్తగా ఉన్నందునే స్థానిక ఎమ్మెల్యే ఎంతో బాధపడి ఆ సందర్భంలో వెతికిన సందర్భాలు ఉన్నాయన్నారు. ఒక పిపి రాజు అనే వ్యక్తే కాదు ఏ కార్యకర్తకు ఎటువంటి చిన్న కష్టం వచ్చినా సమస్య తీర్చే విధంగా పనిచేసే మనస్తత్వం స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు ఉందన్నారు. చిన్నకొండేపూడిలో కాంట్రాక్టర్ మండల ఉపాధ్యక్షుడని సచివాలయ తలుపులు తెరిచి ఉండగానే మరియు ఆ భవనములో ప్రభుత్వ కార్యకలాపాలు జరుగుతుండగానే తాళం వేసిన వైనం అంటూ ప్రచారాలు చేయడం సరికాదని మండిపడ్డారు. సచివాలయం – టు భవనాన్ని అధికారులకు అప్పగించడం జరిగిందని చిన్నచిన్న మైనర్ వర్క్స్ మాత్రమే మిగిలి ఉన్నాయని వాటిని వారం రోజుల్లో కాంట్రాక్టర్ పూర్తి చేసి అధికారులకు అప్పగించడం జరుగుతుందన్నారు. కావాలనే కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు విలేకరులకు లేనిపోని మాటలు చెప్పి తప్పుడు ప్రచారాలు ప్రచురించే విధంగా చేసి తాత్కాలిక ఆనందాన్ని పొందుతున్నారన్నారు. సచివాలయం సమీపంలో అల్లరి మూకలకు అడ్డాగా నిలిచింది అనడం సరికాదన్నారు. స్థానిక సర్పంచ్ పర్యవేక్షణలోనే సచివాలయాన్ని కాపాడటం జరుగుతుందన్నారు. లేనిపోని ఆరోపణలు చేపట్టే ప్రతిపక్ష పార్టీ నాయకుల పై జిల్లా స్థాయి అధికారులు తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నామని సత్తిపండు రాజు అన్నారు.