ప్రభుత్వ విద్యా వ్యవస్థను అస్తవ్యస్తంగా మారుస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు -గాలి రవిరాజ్
స్టూడియో 10 టీవీ న్యూస్ అక్టోబర్ 30, మహానంది:
రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను అస్తవ్యస్తంగా మారుస్తుందని సిపిఐ (యం యల్)రెడ్ స్టార్ పార్టి జిల్లా కార్యదర్శి గాలి రవిరాజ్ కేంద్ర ప్రభుత్వాలను విమర్శించారు. మహనంది గ్రామంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని వైసిపి ప్రభుత్వం అత్యుత్సాహంగా రాష్ట్రంలో అమలు పరుసోందని వారు తెలిపారు దీని వల్ల విద్యార్థులు వారి తల్లిదండ్రులు పలు రకాలుగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. పాఠశాలల విలీనం పేరుతో వైసిపి ప్రభుత్వం వేలాది మంది విద్యార్థులను చదువుకు దూరం చేసిందని వారు విమర్శించారు ఒకవైపు నాడునేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేస్తున్నామని చెఋతు మరోవైపు నూతన విద్యా విధానం అమలు ద్వారా మూడు,నాలుగు, ఐదు తరగతులను విద్యార్థులను హైస్కూలలో విలీనం చేసి త్రీవ ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు బైజూస్ వంటి కార్పోరేట్ సంస్థలకు ప్రభుత్వ పాఠశాలలో భోదించే అవకాశం కల్పించడం వల్ల వారి సిలబస్ విద్యార్థులపై బలవంతంగా రుద్దుతున్నారని వారు విమర్శించారు. ఒకటి రెండు తరగతుల విద్యార్థులను అంగన్ వాడి కేంద్రాలలో కలపడం వల్ల గందరగోళ పరిస్థుతులు ఏర్పడుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజన్న రాజ్యం తెస్తానని చెప్పి ఉచిత విద్యుత్ కు తూట్లు పొడుచేలా వ్యవసాయ విద్యుత్ కనేక్షన్ లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారని వారు విమర్శించారు స్మార్ట్ మీటర్ల వల్ల ముప్పె శాతం ఆదా అవుతుందని ప్రభుత్వం చెబుతుందన్నారు అది ఎలా సాధ్యపడు తుందో తెలపాలని వారన్నారు. విద్యుత్ సంస్కరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం డిస్కంలను ప్రైవేట్ పరం చేసిన తర్వాత ఉచిత విద్యుత్ ఇవ్వడం సాధ్యపడదని వారు తేలియజేశారు వ్యవ సాయ పంపుసెంట్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ను వెంటనే ఉపసంహరించు కోవాలని వారు పూర్తిగా డిమాండ్ చేశారు. ఇటివల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై ఆకృత్యాలు అరాచకాలు ఎక్కువైయ్యా యన్నారు. జగన్ మోహన్ రెడ్డి అధికారం లోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తీసుకవచ్చి అమరావతిని అస్తవ్యస్తం చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ తప్పులను కప్పిపించు కోవడానికి ప్రజా సమస్యలను పక్కదారి పట్టించ డానికి పనికి రాని అంశాలను తెరపైకి తీసుకొచ్చారని వారు విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు పరచలేక కోర్టు తీర్పులను అమలు చేయకుండా ప్రజలను విస్మరిస్తున్నారన్నారు