మహనందిలో పోటెత్తిన భక్తులు
స్టూడియో 10 టీవీ న్యూస్,అక్టోబర్30, మహానంది:
మహానంది పుణ్యక్షేత్రంలో భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు తెల్లవారుజామున ఆలయం వద్దకు చేరుకుని కోనేరులో పుణ్య స్థానాలు ఆచరించి శ్రీ కామేశ్వరి సహిత మహానందిశ్వర స్వామి వారిని దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన తదితర పూజలు నిర్వహించుకుంటున్నారు. భక్తులకు ఎటువంటి అవాంతరాలు లేకుండా చర్యలు తీసుకున్న ఆలయ ఈవో కాపు చంద్రశేఖర రెడ్డి. తెల్లవారుజామునుండే ఆలయంలో ఏర్పాట్లను పరిశీలిస్తూ సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ ప్రతిఒక్కరు స్వామి అమ్మవార్లను దర్శించుకునేల ఏర్పాట్లను చేసిన ఈవో పై సామాన్య భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.