పాలచర్ల గ్రామంలో డంపింగ్ యార్డ్ ఏర్పటుకు కృషి

జగనన్నది పేదల ప్రభుత్వం….

పేదవారి కష్టాలు తీర్చేందుకే సంక్షేమ పథకాలు

పాలచర్ల గ్రామంలో డంపింగ్ యార్డ్ ఏర్పటుకు కృషి

గ్రామంలో ఉన్న గొర్రెలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసే విధంగా పశుసంవర్ధక శాఖ అధికారులకు ఆదేశం

మీ కష్టాల్లో మేము అండగా ఉంటాం… మమ్మల్ని ఆశీర్వదించండి..

గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా…

జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్రలో పేదవారికి కష్టాలను, వారి అవసరాలను కళ్లారా చూసి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీల కంటే ఎక్కువ సంక్షేమ పథకాలను అమలుచేసి ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని తూర్పుగోదావరి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు రాజానగరం శాసన సభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు.

శనివారం నాడు రాజానగరం మండలం పాలచర్ల గ్రామంలో రెండో రోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.

ప్రజా ప్రతినిధులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గ్రామంలో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాల వివరాలను తెలియజేశారు.

గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కార మయ్యే సమస్యలను స్థానిక అధికారుల ద్వారా పూర్తి చేయడానికి ఆదేశాలు జారీ చేశారు..

ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల వద్దకే పాలన తీసుకురావడం కోసం గ్రామాలలో సచివాలయం మరియు వాలంటరీ వ్యవసాయం తీసుకురావడం జరిగిందన్నారు.

గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పథకాల ద్వారా పేదలకు ఇళ్ల స్థలాలతో పాటు మహిళలకు ఆర్థిక లబ్ధి చేకూరేలా ఆసరా,చేయుత,అమ్మ ఒడి వంటి పథకాలను అమలు చేస్తున్నారన్నారు.

గత ప్రభుత్వంలో నిర్లక్ష్యధోరణి వలన పాలచర్ల గ్రామ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం 34.25 లక్షల రూపాయలు నిధులు వెచ్చిస్తే,మన ప్రభుత్వం ఏర్పడిన మూడున్నర సంవత్సరాల కాలంలో గ్రామ అభివృద్ధి కోసం 4.86 కోట్ల రూపాయలు నిధులు ఖర్చు చేయడం జరిగిందన్నారు

మన ప్రభుత్వం ఏర్పడిన మూడున్నర సంవత్సరాల కాలంలో గ్రామంలో ఓ.హెచ్.ఆర్ ట్యాంకు నిర్మాణం స్థానికంగా ప్రభుత్వ పాఠశాల రూపురేఖలను మార్చే విధంగా అభివృద్ధి పనులు, సిసి రోడ్లు సిసి డ్రైన్లు రైతుభరోసా కేంద్రం గ్రామ సచివాలయం వంటి నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు..
గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనుల కంటే మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు 15 రెట్లు ఎక్కువగా ఈ గ్రామంలో అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు..

పాలచర్ల గ్రామ అభివృద్ధిలో భాగంగా రానున్న రోజుల్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసే విధంగా అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు..

పాలచర్ల గ్రామంలో ఉన్న సుమారు 4,500 గొర్రెలకు వ్యాక్సినేషన్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని సంబంధిత పశుసంవర్ధక శాఖ అధికారులకు ఆదేశించడం జరిగిందన్నారు

ముఖ్యంగా అభివృద్ధి,సంక్షేమం కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఎమ్మెల్యే రాజా తెలియజేశారు..

ఈ కార్యక్రమంలో గంగిశెట్టి సోమేశ్వర రావు,కొత్తపల్లి అబ్బులు, నాళం రోశయ్య,వేమగిరి కృష్ణ, పి.లక్ష్మీనారాయణ,వేముల తాతా రావు,వై.రాజు,వీజేష్,కె.నాగేశ్వర రావు,మండల నాయకులు దూలం పెద్ద,మందారపు వీర్రాజు, వాసంశెట్టి పెద్ద వెంకన్న,గండి నాని బాబు, ప్రగడ చక్రి,కుందేటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!