పరిచారకునికి జరిమానా
స్టూడియో 10 టీవీ న్యూస్, అక్టోబర్ 28, మహానంది:
మహానంది దేవస్థానంలో ఒక పరిచారకునికి ఆలయ ఉన్నతాధికారి జరిమానా విధించినట్లు సమాచారం. కార్తీక మాసం ప్రారంబంలో సకల దేవతా మూర్తులను ఆహ్వానిస్తూ ధ్వజస్తంభంవద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి కార్తీక దీపం వెలిగిస్తారు. ఈ కార్యక్రమానికి హాజరై మధ్యలోనే వెళ్లిపోయిన ఒక పరిచారకునికి 10 వేలు జరిమానా విధించినట్లు తెలిసింది. అయినా ఆపరిచారకుడు ఉన్నతాధికారి ఆదేశాలను పాటిస్తాడా లేదా అన్నది స్థానికులు చర్చించుకుంటున్నారు.