మహానందిలో మద్యం షాపు తరలింపుకు ఏర్పాట్లు
స్టూడియో 10 టీవీ న్యూస్, అక్టోబర్ 28, మహానంది:
మహానందిలో ఉన్నటువంటి ప్రభుత్వ మద్యం షాపు తరలింపునకు అధికారులు ఏర్పాటు చేసినట్లు సమాచారం.నవంబర్ ఒకటో తేదీ నంద్యాల మహానంది రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు భవనం లోనికి మార్చడానికి ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తుంది.కొందరు గ్రామస్తులతో పాటు మహానంది ఆలయ అధికారులు కూడా జిల్లా కలెక్టర్ కు మద్యం షాపును పక్క గ్రామాలకు తరలించాలని గతంలో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.అందుకుగాను స్పందించిన అధికారులు ప్రస్తుతం ఉన్న అటువంటి స్థానం నుంచి మహానందిలోని ఇతర ప్రాంతానికి తరలించడానికి అనుమతులు మంజూరైనట్లు విశ్వాసం సమాచారం.దీనిపై ఆలయ అధికారులు పక్క గ్రామాలకు తరలిపోతుందన్న మద్యం దుకాణం మహానందిలోనే ప్రస్తుతం ఉన్నటువంటి స్థానం నుండిమరికొంత దూరంలోకి మార్చడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని అయినా ఉన్నతాధికారులు తీసుకొన్న చర్యలకు చేసేది ఏమీ లేక మిన్న కున్నట్లు సమాచారం.మద్యం షాపు మారుస్తారని సమాచారం బయటకు పంపడంతో నూతనంగా ఏర్పాటు చేసే స్థలము పక్కన పంట పొలాలు ఉండడంతో కొందరు రైతులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తుంది.