బస్సులో నుంచి పొగలు
ఆర్టీసీ బస్సులోంచి పొగలు రావడంతో ప్రయాణీకులు అందోళనకు గురైన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. సాయంత్రం నంద్యాల డిపోకు చెందిన ఆర్టీసీ డీలక్స్ బస్సు విజయవాడ నుండి నంద్యాలకు వస్తున్న సమయంలో గాజులపల్లి మెట్ట వద్దకు రాగానే బస్సులో పొగలు రావడంతో ఒక్కసారిగా ప్రయాణీకులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. అప్రమత్తమైన బస్సు డ్రైవర్ ఆపుకొని పొగలు వచ్చే రేడేటర్ ప్రదేశంలో బిందెలతో నీళ్శు చల్లారు. అందులోని ఏడు మంది ప్రయాణికులను వేరే బస్సుకి పంపించారు. బస్సులను కండిషన్ ఉంచడం, ఓవర్ లోడ్ పడకుండా చేయాల్సిన ఆర్టీసీ అధికారులు వాటిని పట్టించుకోకుండా బస్సులను నడిపి స్తున్నారని ప్రయాణీకులు ఆరోపిస్తున్నారు.ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు బస్సులను కండిషన్‌లో ఉండేట్లు చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.