*నేటితో ముగిసిన మండల స్థాయి క్రీడా పోటీలు..*
_– మండల విద్యాశాఖ అధికారి(ఏమ్ఈఓ)డి.మురళి సత్యనారాయణ.._
*_డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రమైన ఆలమూరు శివారు కొత్తూరు సెంటర్లో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం రెండవ రోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు నిర్వహించిన మండల స్థాయి క్రీడా పోటీల ఎంపికలు నేటితో ముగియనున్నట్లు మండల విద్యాశాఖ అధికారి(ఏమ్ఈఓ),ప్రధానోపాధ్యాయులు డి.మురళి సత్యనారాయణ తెలియజేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎంపిక పోటీలలో అండర్ 14,17 విభాగాలలో బాల,బాలికలకు రన్నింగ్,లాంగ్ జంప్,హై జంప్,షాట్ పుట్,త్రోబాల్,కబడ్డీ,కోకో వంటి ఆటల పోటీలు నిర్వహించగా మండలంలో వివిధ గ్రామాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల నుండి సుమారు 70 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొనగా వారికి ఉచిత మధ్యాహ్నభోజన వసతి సదుపాయం కల్పించడం జరిగిందని ఈ పోటీలలో ఎంపికైన విద్యార్థినీ విద్యార్థులు రేపు అనగా 29వ తేదీ శనివారం రావులపాలెం మండలం ఊబలంక గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరగబోయే నియోజకవర్గం స్థాయిలో నిర్వహించే ఆథల్టిక్స్ అనగా రన్నింగ్,లాంగ్ జంప్,హై జంప్,షాట్ పుట్ మొదలగు క్రీడా విభాగాలలో ఆలమూరు మండలంకు చెందిన 35 మంది విద్యార్థిని,విద్యార్థులు క్రీడా పోటీలలో పాల్గొంటున్నారని అలాగే మిగిలిన వాలీబాల్,కబడ్డీ,కోకో,త్రోబాల్ మొదలగు ఆటల పోటీలకు సంబంధించిన నియోజకవర్గం స్థాయి క్రీడా పోటీల ఎంపికలు ఈనెల 31వ తారీఖున బాలుర విభాగమునకు,నవంబర్ 1వ తారీఖున బాలికల విభాగమునకు ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఈ పోటీలలో విజయం సాధించిన విద్యార్థులను జిల్లాస్థాయి క్రీడా పోటీలకు పంపించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు రాజు,మండల క్రీడా పోటీల సమన్వయకర్త జి.సూర్య శంకర్రావు,మండల సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు ఎస్ఎస్ నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.._*