నేర నియంత్రణ పై ప్రత్యేక దృష్టి సారించాలి

*తిరుపతి జిల్లా…*

🔰 *నేర నియంత్రణ పై ప్రత్యేక దృష్టి సారించాలి.*

🔰 *అవినీతికి తావు లేకుండా పని చేయాలి.*

🔰 *విధులను సమర్థవంతంగా నిర్వర్తించండి పోలీస్ కి ఎక్కడ చెడ్డపేరు రాకూడదు.*

🔰 *విజిబుల్ పోలీసింగే ప్రధాన ద్యేయం.*

🔰 *క్రైమ్ మీటింగ్ లో ఎస్పీ శ్రీ.పి. పరమేశ్వర రెడ్డి ఐపీఎస్.,*

నేరాల నియంత్రణకు కిందిస్థాయి సిబ్బంది నుంచి పనితీరు మెరుగుపరుచుకునే నియంత్రించాలని ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి, ఐపీఎస్., గారు పేర్కొన్నారు. శనివారం యస్వీ యూనివర్సిటీ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో జిల్లా ఎస్పి గారు నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ జిల్లాలో నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలన్నారు. పోలీస్ వ్యవస్థ సమాజంలో ఉన్న భావన ప్రజల్లో కల్పించాలని స్టేషన్ హౌస్ మానిటరింగ్ సిస్టం పూర్తిగా కనబడటం లేదని వీటిని పర్యవేక్షించే బాధ్యత డీఎస్పీ సీఐ లపై ఉందన్నారు. నేరాలను అదుపు చేసేందుకు విజిబుల్ పోలీసింగ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఆది సరిగ్గా నిర్వహించనప్పుడే నేరాలు అధికంగా జరుగుతాయన్నారు. దీనిపై సంబంధిత అధికారుల నుంచి సిబ్బంది వరకు పోలీస్ పర్యవేక్షణ చేయాలన్నారు, అప్పుడే పోలీసులు కూడా విలువలు ఉంటాయన్నారు.

*మిస్సింగ్ కేసుల పై ప్రత్యేక దృష్టి సారించండి.*

ప్రతి స్టేషన్లలో నమోదైన మిస్సింగ్ కేసులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి దర్యాప్తు చేయాలన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత అధికారులను అప్రమత్తం చేస్తూ సిబ్బందితో సాంకేతికంగా దర్యాప్తు చేయాలన్నారు. మిస్సింగ్ కేసులు ఎప్పటికప్పుడు ఛేదిస్తూ, ప్రజల వద్ద శభాష్ అనిపించుకోవాలన్నారు. ప్రాపర్టీ కేసును ఛేదించడం లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకొని త్వరితగతిన పూర్తి న్యాయం జరిగేలా బాధితులకు చూడాలన్నారు. హైకోర్టు ఆదేశాలను గౌరవించి అనుమానితులు రౌడీషీటర్ల విషయంలో వారి మార్పు కోసం ప్రత్యేక శ్రద్ధ చూపడం తో పాటు వారి కదలికలపై పూర్తిస్థాయిలో నిఘా ఉంచాలన్నారు.

*మహిళా సంరక్షణ కార్యదర్శులు తో పని చేయించుకోండి*

రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంరక్షణ కార్యదర్శులను ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిందన్నారు. వారి అందరి వద్ద ఆశించిన స్థాయిలో పని చేయించుకోవాలని సూచించారు. వీరంతా నిరంతరం ప్రజల్లో తిరుగుతూ అజ్ఞాత శక్తులపై, వారి కదలికలపై నిఘా ఉంచుతూ సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు. అదేవిధంగా ప్రతి స్టేషన్ పరిధిలో అక్రమ మద్యం రవాణా పై పూర్తిస్థాయిలో ఉక్కుపాదం మోపాలన్నరు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిబ్బందితో పరస్పరం సమన్వయంతో పనిచేసి ఉత్తమ ఫలితాలు రాబట్టలన్నరు.

*పంచాయతీలు చేస్తే సహించం*

పోలీసులు భూ సమస్య లో దూరి పంచాయతీలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. పరస్పరం అందులో న్యాయ విచారణ జరపడానికి ఏ పక్క న్యాయ ఉంటే వారికి మాత్రమే న్యాయం చేయాలన్నారు. పోలీసులు పంచాయతీకి పాల్పడినట్లు తమ దృష్టికి వస్తే సహించేది లేదని ఎంతటివారినయినా సరే శాఖాపరమైన చర్యలు తప్పవని తెలిపారు. ఎక్కడ కూడా ఎలాంటి అవినీతికి తావులేకుండా ప్రతి ఒక్కరు తమ వంతుగా పనిచేయాలన్నారు.

*దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించాలి.*

జిల్లా వ్యాప్తంగా చాలావరకు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన తరువాత ఆచరించాల్సిన దర్యాప్తు ముమ్మరం చేయకుండా కాలయాపన చేయడం జరుగుతోంది. ఇది చాలా ముఖ్యమైన అంశం ప్రతి ఒక్క పోలీస్ అధికారి శ్రద్ధతో విది నిర్వహణ పాటిస్తే పెండింగ్ కేసులను పరిష్కరించ వచ్చని అన్నారు.

*కేసు దర్యాప్తు విషయంలొ కోర్టు నియమావళిని పాటించాలి.*

కేసులను దర్యాప్తు చేస్తున్నపుడు లేదా వాహణాలను, వస్తువులను స్వాధీనం చేసుకునేటప్పుడు పాటించాల్సిన నియమాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఈ విషయంలో హైకోర్టు ఆదేశాలను తప్పకుండా పాటించాలన్నారు.

*శాంతి భద్రతల పర్యవేక్షణ.*

సాంఘిక కార్యకలాపాలు జరగకుండా గట్టి చర్యలు తీసుకుని ఉక్కు పాదం మోపాలన్నారు. ప్రతిరోజు విజిబుల్ పోలీసింగ్ తప్పకుండా చేయాలని విజిబుల్ పోలీసు వలన శాంతి భద్రతలను పరిరక్షించడానికి దోహదపడుతుందని అలాగే ప్రతిరోజు అధికారులు సిబ్బందితో ఉదయం పూట వారితో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఆరోజు జరుగు విధివిధానాలపై అవగాహన కల్పించాలన్నారు. సెల్ఫ్ డెవలప్మెంట్ ఉంటేనే అన్ని సక్రమమైన మార్గంలో నిర్వహించడం జరుగుతుందని ఈ విషయంలో ఎవరు రాజీ పడకూడదని అధికారులకు సూచనలు చేశారు.

పోలీస్ విధులను నిర్వర్తించాలని కొన్ని సందర్భాలలో పోలీస్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వలన కొన్ని అనుకొని ఘటనలు తరచూ జరుగుతుందని దీనిని సరి చేయలేకపోతే శాంతి భద్రతలకు ఆటంకం కలుగుతుందన్నారు.

*ప్రమాదాల నియంత్రణకు కృషి చేయండి*

నేషనల్ హైవే రోడ్డు ప్రాంతాలలో ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నిరంతరం రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను దరువు గా గుర్తించి తగు ఏర్పాట్లు చేయాలన్నారు. తెల్లవారుజామున బీట్ పోలీసులు వాహన డ్రైవర్లను అప్రమత్తం చేస్తూ వారికి అవగాహన కల్పించాలన్నారు. హైవే రోడ్ల లో ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ లు చేయకుండా నియంత్రించి ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. అదేవిధంగా వారివారి ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు కావలసిన అన్ని జాగ్రత్తలను చేపట్టాలన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే.. తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు.

హైవేపై రోడ్డు ప్రమాదాలు నివారణ కొరకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రమాదాలు పొంచి ఉన్నచోట హైవే మొబైల్ లను ఉపయోగించుకొని ప్రమాదాలు నివారణ కొరకు చర్యలు తీసుకోవాలన్నారు.

అవినీతికి అనవసరంగా ఆస్కారం, చెడ్డ పేరు తీసుకొని రాకండి. మీరు పని చేయకపోతే మీతో పని చేసే విధానం నాకు తెలుసు నా వరకు వస్తే తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ యస్.పి లు అడ్మిన్ శ్రీమతి ఇ.సుప్రజ మేడం గారు, L&O శ్రీ కులశేఖర్ గారు, క్రైమ్ శ్రీమతి విమల కుమారి గారు, తిరుమల మునిరామయ్య గారు, డి.యస్.పి లు యస్.బి I చంద్రశేఖర్, యస్.బి II రమణ, తిరుపతి జిల్లాలోని డి.యస్.పి లు, సి.ఐ లు, యస్.బి సి.ఐ రామకృష్ణ ఆచారి, యస్.ఐ లు పబ్లిక్ ప్రోసిక్యుటర్ లు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!